ర్యాంకింగ్‌లో ఐఐఠీవీ

IITVV in the ranking

IITVV in the ranking

Date:19/10/2018
ముంబై ముచ్చట్లు:
దేశంలోని ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగ్‌లో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి ఐఐటీలు ఆధిక్యాన్ని కనబరిచాయి. బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న క్యూఎస్ క్వాక్వెరెల్లీ సైమండ్స్ అనే సంస్థ రూపొందించిన ‘క్యూఎస్ ఇండియా యూనివర్సిటి ర్యాంకింగ్స్’లో ఐఐటీ బాంబే అగ్ర స్థానాన్ని ఆక్రమించింది. ఐఐటీ మద్రాస్ మూడో స్థానంలో, ఐఐటీ ఢిల్లీ నాలుగో స్థానంలో, ఐఐటీ ఖరగ్‌పూర్ అయిదో స్థానంలో, ఐఐటీ కాన్పూర్ ఆరో స్థానంలో, ఐఐటీ రూర్కీ తొమ్మిదో స్థానంలో, ఐఐటీ గౌహతి పదో స్థానంలో నిలిచాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్  రెండో స్థానంలో నిలిచింది.
యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, యూనివర్సిటి ఆఫ్ ఢిల్లీ వరుసగా ఏడు, ఎనిమిదో స్థానంలో నిలిచాయి. భారత్‌లోని ఉన్నత విద్యాసంస్థల ప్రమాణాలను స్వతంత్రంగా, అంతర్జాతీయ కోణంలో మదింపు వేయడానికి బ్రిక్స్ ర్యాంకింగ్‌లకు ఉపయోగించే సూచీలనే ఈ అధ్యయనానికి ఉపయోగించినట్లు క్యూఎస్‌లో రీసెర్చ్ డైరెక్టర్ బెన్ సోవ్‌టర్ తెలిపారు.
ప్రధానమయిన భారత ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనా ఫలితాలు పెరుగుతున్నాయని, ఈ పరిశోధన ఫలితాల ప్రభావం కూడా క్రమంగా పెరుగుతోందని వెల్లడించిన తాజా అధ్యయనం నిరూపిస్తోందని ఆయన తెలిపారు. భారత ఉన్నత విద్యాసంస్థలు అంతర్జాతీయంగా ఇతర ఉన్నత విద్యాసంస్థల నుంచి గుర్తింపు పొందడంలో కొంత వరకు విజయం సాధించాయి. అయితే, భారత్‌లోని ఉన్నత విద్యాసంస్థలు ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా కలిసి పనిచేయడాన్ని తీవ్రం చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
Tags:IITVV in the ranking

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *