విడిసి ఫిర్యాదుతోనే రశీదులు పంచిన ఐకెపి నిర్వాహకులు

-తప్పుల తడకలతో, కోతలతో నెల రోజులకు అందిన రశీదులు
-నిండా మోసానికి గురైన బుగ్గారం రైతులు
-రైతుల పక్షాన నిలచి న్యాయపోరాటం చేస్తాం

Date:29/06/2020

జగిత్యాల ముచ్చట్లు:

విడిసి అధ్వర్యంలో గత శుక్రవారం బుగ్గారం తహసీల్దార్ కు చేసిన పిర్యాదుతోనే ఐకెపి నిర్వాహకులు రైతులకు గత రెండురోజుల నుండి ధాన్యం అమ్మకాల రశీదులు పంపిణీ చేస్తున్నారని గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చుక్క గంగారెడ్డి తెలిపారు.సోమవారం చుక్క గంగారెడ్డి బుగ్గారంలో విలేఖరులతో మాట్లాడుతూ బుగ్గారం ఐకెపి సెంటర్ లో జరిగిన మోసాలు, కోతలు, ధాన్యం తరుగు గ్రామ రైతులను దోపిడీకి గురిచేశాయని ఆయన ఆరోపించారు. ప్రతి రైతు ఈ సారి దోపిడీకి గురయ్యాడని, రైతు అమ్మిన ధాన్యానికి 10నుండి 12.5 శాతం వరకు రక రకాల తప్పుడు కారణాలతో కోతలు విధించి దోచుకున్నారని ఆయన ఆవేదన వ్యక్యం చేశారు. నెలలు గడిచినా రైతుల ధాన్యం అమ్మకాల రశీదులు జారీ చేయకపోవడం పలు అనుమానాలకు తావిచ్చిందన్నారు. విడిసి పిర్యాదుతో గత రెండు రోజుల నుండి పంపిణీ చేసిన రైతుల ధాన్యం అమ్మకాల రశీదులు రైతుల అనుమానాలను నిజం చేశాయని పేర్కొన్నారు. రశీదులను పరిశీలించగా అనేక అక్రమాలు బయటపడ్డాయని ఆయన సూచించారు.

 

ఆరు గాళాలు రైతు శ్రమించి పండించిన ధాన్యం దోపిడీ దారుల పాలయ్యిందని ఆయన అన్నారు. ఐకెపి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, ఐఆర్ డిఏ అధికారులు సైతం బుగ్గారం రైతులకు ప్రజా కోర్టులో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని తెలిపారు. జిల్లా స్థాయి అధికారుల హామీలు కూడా నీటి పాలయ్యాయని, మందలిస్తే చాలు అధికారులు ముఖం చాటేసుకుంటున్నారని చుక్క గంగారెడ్డి మండిపడ్డారు. ఇకనైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి బుగ్గారం గ్రామ రైతులకు జరిగిన మోసాలను, దోపిడీని పసిగట్టి అక్రమాలను వెలికితీసి సరైన న్యాయ జరిపి
రైతులను ఆదుకోవాలని చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన నిలచి న్యాయ పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

19.42 క్వింటాళ్ల ధాన్యం దోచుకున్నారని ఓ రైతు

Tags:IKP managers who issue receipts with a separate complaint

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *