Ill hospitalized with two doctors

ఇద్దరు డాక్టర్లతో ఆస్పత్రికి అనారోగ్యం

– రెండు నెలలుగా జీతాలు లేక సిబ్బంది విలవిల

-పట్టించుకోని ఉన్నతాధికారులు

-మంత్రి పెద్దిరెడ్డి చర్యలు తీసుకోవాలని వినతి

Date:01/08/2020

పుంగనూరుముచ్చట్లు:

కరోనా నియంత్రణలో ఎనలేని సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి ఉన్నత అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో సిబ్బంది విలవిల్లాడుతున్నారు. ఇద్దరు డాక్టర్లు నడుమ సమస్య తీవ్రం కావడం, ఉన్నత అధికారులు పట్టించుకోకపోవడంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బంది కోరుతున్నారు. మండల పి.హెచ్.సి ఆసుపత్రిలో సుమారు 80 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. పుంగనూరులోకరోనా కేసుల సంఖ్య   పెరుగుతుండడంతో వైద్య సిబ్బంది సేవలు ప్రశంసనీయం. ఇలాంటి తరుణంలో మెడికల్ ఆఫీసర్ గా ఉన్న డాక్టర్ సోనియా విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఆమె 20 రోజుల క్రితం బైరెడ్డిపల్లి బదిలీ చేస్తూ డిఎంఅండ్హెచ్ఓ అండ్ హెచ్ వో పెంచలయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె స్థానంలో చౌడేపల్లి మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్ నియమించారు. ఈ మేరకు శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన పదిహేను రోజులు కావస్తున్నా సోనియా బాధ్యతలు అప్పగించడంతో డాక్టర్ శ్రీకాంత్ కు ఎలాంటి అధికారాలు లేకుండా పోయాయి . ప్రతినెల 20వ తేదీలోపు వైద్య సిబ్బందికి జీతాలు చెల్లించాల్సి ఉంది. కానీ రెండు నెలలు కావస్తున్నా  శ్రీకాంత్ కు జీతాలు చెల్లించి అధికారం లేకపోవడం, డాక్టర్ సోనియా బదిలీ అయిన ఇక్కడే ఉండటం తో ఇద్దరు డాక్టర్లతో వైద్య సిబ్బంది ఇరుకున పడ్డారు .ఈ విషయమై పలుమార్లు డిఎంఅండ్హెచ్ఓ వైద్య సిబ్బంది ఫిర్యాదు చేసినా ఆయన స్పందించకపోవడంతో వైద్య సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్ కూడా సెలవులు పెడుతున్నట్లు సమాచారం.

మరోఅడుగు ముందుకేసిన ఏపీ పోలీస్ శాఖ..!

Tags:Ill hospitalized with two doctors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *