Corona patients at home

ఆసుపత్రి కంటే ఇల్లే పదిలం.. ముఖం చాటేస్తున్న రోగులు

Date:26/10/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

కొవిడ్‌ ఉధృతి బాగా తగ్గుముఖం పట్టినందున తెలంగాణలో కొవిడ్‌ చికిత్సకు అనుమతుల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే ప్రైవేటు ఆస్పత్రులకు ఇకపై అనుమతి ఇవ్వకూడదని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. జిల్లాల నుంచి ఇప్పటికే పలు ప్రైవేటు ఆస్పత్రులు అనుమతుల కోసం దరఖాస్తు చేసు కున్నాయి. వాటిని ప్రభుత్వం పెండింగులో ఉంచింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గడం, ఉన్న ఆస్పత్రుల్లోనే బెడ్లు ఖాళీగా ఉంటుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు కొన్ని ప్రైవేటు ఆస్పతులకు కూడా ప్రభుత్వం కొవిడ్‌ చికిత్సకు అనుమతులు ఇచ్చింది. రాష్ట్రంలో క్రమంగా పరిస్థితులు మెరుగుపడి.. పాజిటివ్‌ కేసులు బాగా తక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రులకు వచ్చి చికిత్స తీసుకునే వారి సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. దీంతో.. ఇక కొవిడ్‌ చికిత్సకు అదనపు ఆస్పత్రుల అవసరం ఉండదని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఆస్పత్రులు కిటకిట. బెడ్డు కావాలంటే రెకమండేషన్లు.. లక్షల్లో డిపాజిట్లు.. అడ్వాన్స్‌ బుకింగులు. బెడ్డు దొరకడమే మహాద్భాగ్యం. ఇదీ.. నిన్నటి వరకు రాష్ట్రంలో కొవిడ్‌కు చికిత్స అందించే ప్రైవేటు ఆస్పత్రుల్లోని స్థితి. దీంతో.. కొవిడ్‌ చికిత్సకు అనుమతుల కోసం ప్రైవేటు ఆస్పత్రులు పోటీపడ్డాయి. కానీ.. నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

 

 

కొవిడ్‌ ఆస్పత్రులన్నీ వెలవెలబోతున్నాయి. బెడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రైవేటే కాదు.. ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి. దీనికి రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గడం ఓ కారణమైతే.. వైరస్‌ సోకిన వారు కూడా ఆస్పత్రి కంటే ఇల్లే పదిలం అనుకోవడం మరో కారణం. ఈ స్థితిలో.. కొవిడ్‌ చికిత్సకు కొత్తగా ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.రాష్ట్రంలో పాజిటివ్‌లు తగ్గుతుండడంతో ప్రైవేటు ఆస్పత్రులు క్రమంగా పడకల సంఖ్యను కూడా తగ్గించేస్తున్నాయి. కొన్ని ఆస్పత్రులు కొవిడ్‌ చికిత్స నుంచే వైదొలగుతున్నాయి. వైరస్‌ ఉధృతి అధికంగా ఉన్న రోజుల్లో ప్రైవేటు ఆస్పత్రులు భారీగా కొవిడ్‌ చికిత్సకు అనుమతులు పొందాయి. సెప్టెంబరు 1 నాటికి రాష్ట్రంలో మొత్తం 184  ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్‌ చికిత్స అందిస్తుండగా, అక్టోబరు 1 నాటికి ఆ సంఖ్య 231కి చేరింది. కానీ.. అక్టోబరు 1 నుంచి రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. ప్రైవేటు ఆస్పత్రులన్నీ క్రమంగా ఖాళీ అయిపోయాయి.

 

 

దీంతో..  20 రోజుల వ్యవధిలో మూడు ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్‌ చికిత్స నుంచి వైదొలగగా.. ఆస్పత్రులన్నీ కలిపి మొత్తం 529 కరోనా బెడ్లను తొలగించాయి. ప్రస్తుతం ప్రైవేటులో దాదాపు 80 శాతం బెడ్లు, సర్కారు ఆస్పత్రుల్లో 83 శాతం పడకలు ఖాళీగా ఉన్నాయి. అక్టోబరు 23 నాటికి రాష్ట్రంలోని 228 ప్రైవేటు కొవిడ్‌ ఆస్పత్రుల్లో మొత్తం 8,945 కరోనా బెడ్లు ఉండగా, అందులో 7,199 ఖాళీగా ఉన్నాయి. 61ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 8,561 పడకలుంటే.. అందులో 7129 బెడ్లు ఖాళీగానే ఉన్నాయి. కరోనా చికిత్సకు ప్రత్యేక వ్యవస్థలతో పాటు నిపుణులైన వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది కూడా ఉండాలి. వారికిచ్చే వేతనాలు కూడా భారీగానే ఉంటున్నాయి. రోగుల రాక తగ్గిపోయి.. ఆదాయం లేకపోతుండడంతో నిర్వహణ కూడా భారమవుతోందని ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకుడు తెలిపారు. అందుకే కొవిడ్‌ చికిత్స నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.

తెలంగాణ పాలిటిక్స్ అన్నీ దుబ్బాకకి లింక్

Tags:Ille padilam than the hospital .. patients chatesutunna face

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *