విలేకరులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి
చిత్తూరు ఎస్పీకి ఏపీయూడబ్ల్యూజే వినతి
చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో విలేకరులపై పెట్టిన అక్రమ కేసు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చిత్తూరు ఎస్ పి రిషాంత్ రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ ఒక వ్యక్తి మృతి కి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది అని వాట్సప్ గ్రూప్ లో పోస్ట్ చేసినందుకు వివరాలు ఇవ్వకపోగా మండల ఎస్సై లోకేష్ నలుగురు విలేకరుల పైన అక్రమంగా కేసులు బనాయించారని పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి అల్లుడు ఫిర్యాదు ఇచ్చారని తప్పుడు కేసు బనాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఫిర్యాదు దారుడు తాను ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదని ఎస్పీకి తెలియజేశారు. ఈ విషయంలో విచారణ జరిపించి సంబంధిత పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పి స్పందిస్తూ విచారించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్ పి ని కలిసిన వారిలో చిత్తూరు ప్రెస్ క్లబ్ కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షుడు మహేష్, జాయింట్ సెక్రెటరీ అభి, రమేష్, మూర్తి ,చిత్తూరు జర్నలిస్టులు ఏపీయూడబ్ల్యూజే తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోటేశ్వర బాబు, విలేకరులు గోవిందస్వామి, రవి, జయ చంద్రారెడ్డి, సురేష్ రెడ్డి, వెంకటేష్ రెడ్డి, మూర్తి, వెంకట కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Tags; Illegal cases against journalists should be dropped
