Natyam ad

తుప్రాన్ లో  అక్రమ దందా

మెదక్ ముచ్చట్లు:
 
అదో అంతర్జాతీయ ప్రమాణాల ఉన్న విద్యా క్షేత్రం.. దాని చుట్టూరా జరిగేది మాత్రం అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం. తూప్రాన్ పట్టణంలోని నల్లపోచమ్మ కాలనీలో గుడికి వెళ్లే రహదారిలో తమ జాగకు
ఆనుకుని ఉన్న వక్ఫ్ బోర్డు స్థలాన్ని ఆక్రమించి గుట్టుచప్పుడు కాకుండా తూతూమంత్రంగా ఓ వెంచర్ చేసి క్రయవిక్రయాలు కానిచ్చి చేతులు దులుపుకున్నారు ఆ విద్యా సంస్థ నిర్వాహకులు. ఎక్కడా ఓ
వెంచర్‌కు ఉండాల్సిన నిబంధనలు లేనేలేవు. ఇంత కథ ఉన్నా ఆ అక్రమ వెంచర్‌లో ఏకంగా రిజిస్ర్టేషన్ల ప్రక్రియలకే షురూ చేశారట. అన్నీ అనుకూలిస్తే నేడో..రేపో అధికారికంగా రిజిస్ర్టేషన్లు చూపిస్తామంటూ
కొంత మంది బ్రోకర్లు వసూల్ రాజాల అవతారం మెత్తారు. ఒక్కో ఫ్లాట్ కొనుగోలు దారు నుండి నానా పేర్లు చెప్పి ప్లాట్‌కి 30వేలు వసూళ్ళు చేస్తున్నారట. సదరు వెంచర్లో తన ప్లాట్లను రీసేల్‌కు యత్నించి
విఫలమైన ఓ వ్యక్తి వివరాలు ఆరా తీయడంతో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వెంచర్లో సింహ భాగం వక్ఫ్ బోర్డు స్థలముందని, ఆ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని, తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్‌తో
పాటు ఆ వెంచర్ నిర్వాహకులకు అప్పటికే వక్ఫ్ బోర్డు ప్రతినిధుల నుంచి నోటీసులు రాగా, వాటిని తొక్కి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తొలుత బాధితులంతా ఏకమవడం, సదరు వెంచర్
యాజమాన్యంపై తూప్రాన్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడం, దాంతో ఆ స్కూల్ యజమాని దిగొచ్చి తనకున్న మరో స్థలంలో వెంచర్ రాసిస్తానని ఒప్పుకుని, ప్లాట్లు చేయడం చకచకా జరిగిపోయాయి. ఇందులో
వెంచర్‌కు ఉండాల్సిన లే అవుట్ ప్లానింగ్, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అనుమతులు లాంటి ఒక్క నిబంధనలు ఉండవు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు అంశాల ప్రస్తావన అసలే ఉండదు. ప్రజావసరాల
కోసం కనీసం పది శాతం స్థలాన్ని మున్సిపల్ కు కేటాయించక పోవడం లాంటివన్నీ ఊష్ పటాకే..
 
 
 
అయినా ఎలా మున్సిపల్ అనుమతులిస్తారో, రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారో ఎవరికి  అర్థం కానీ
పద్మవ్యూహమే.మున్సిపల్ ఛైర్మన్, రిజిస్ట్రేషన్ అధికారి పేరు చెప్పి ఒక్కో బాధితుడి నుండి తలా రూ. 30 వేలు వసూలు చేస్తున్నారట. సదరు అక్రమ వెంచర్లో  యజమాని దగ్గరే భూమి కొనుగోలు చేసి తన
పేరు చెప్పడానికి భయపడుతున్న పలువురు బాధితులు  తెలిపారు. ఒక్కో వ్యక్తి నుండి 30 వేలు అంటే ఏక మొత్తంగా వసూళ్లు దాదాపు రూ. 15-20 లక్షలపై మాటేనంట! ఈ డబ్బంతా తూప్రాన్ కుచెందిన ఓ వ్యాపారి వద్ద జమ చేశారు. వెంచర్ నిర్వాహకులు చేసిన తప్పుకు తామెందుకు డబ్బులు చెల్లించాలని బాధితులు ప్రశ్నిస్తే, అమ్యామ్యాలకు లొంగి, కమీషన్లకు ఆశపడ్డ మరో వర్గం బాధితులుబెదిరింపులకు పాల్పడుతున్నారని, లేదంటే ఎంతకో అంతకు ప్లాటు విడిచి వెళ్లాలని వేధిస్తున్నారని వాపోతున్నారట.అయితే తాము ఉచ్చులో చిక్కుకున్నామని, ఈ విషయమై మెదక్ జిల్లా కలెక్టర్‌కు
రహస్యంగా ఫిర్యాదు చేశామన్నారు బాధితులు.రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి విచారణకు ఆదేశించి, తమ డబ్బులు తమకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
 
Tags: Illegal danda in Tupran

Leave A Reply

Your email address will not be published.