అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
ఎన్టీఆర్ జిల్లా ముచ్చట్లు:
ఇబ్రహీంపట్నం పోలీసులు రేషన్ మాఫియా కు చెక్ పెట్టారు. ఇబ్రహీంపట్నం మండలం కాచవరం నుండి విస్సన్నపేటకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రే తరలిస్తున్నారు అనె పక్కా సమాచారం అందుకున్న స్థానిక ఇబ్రహీంపట్నం పోలీసులు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న బోలోరో వాహనాన్ని మరియు డ్రైవర్ ను, మరి కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఒక బొలెరో వాహనాన్ని సిజ్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి తరలించారు.
Tags; Illegal harvesting of ration rice

