Natyam ad

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

ఇబ్రహీంపట్నం ముచ్చట్లు:


ఇబ్రహీంపట్నం పోలీసులు వాహనాలు తనిఖీల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని గుర్తించి పట్టుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీ డ్రైవర్ మరియు క్లీనర్ ని అదుపులోకి తీసుకున్నారు. ఒక చీకటి వ్యాపారిని కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. అక్రమ రేషన్ బియ్యం తరలింపు పై పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. అసలు అక్రమ రేషన్ మాఫియా డాన్ పేరు ఇప్పటికైనా బయటకు వస్తుందా. ప్రతి నెల ఎన్నో టన్నులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న కూడా నిమ్మకు నీరు ఎత్తినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తూ ప్రతి నెల లక్షల్లో ఆదాయాన్ని అర్జిస్తున్న అక్రమ రేషన్ మాఫియా డాన్ లు పై ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారా.

 

Tags: Illegal harvesting of ration rice

Post Midle
Post Midle