యదేఛ్చగా అక్రమ నిర్మాణాలు

Date:17/03/2018
విజయవాడ ముచ్చట్లు:
కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో బహుళ అంతస్థుల భవనాల అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సిఆర్‌డిఎ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే సిబ్బంధితో హడావుడి చేసి ఒకటి అరా అక్రమ కట్టడాలను మాత్రమే గుర్తించి వాటికి రంద్రాలు చేయడం, పిట్ట గోడలను పగులకొట్టడం ఇలాంటి సీన్లు సష్టించడం షరామామూలుగా తయారైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తరువాత పెనమలూరు మండలంలో బహుళ అంతస్థుల అక్రమ నిర్మాణాలు తామరతంపరగా పెరిగిపోయాయి. మండలంలోని యనమలకుదురు, పెనమలూరు, పెద్దపులిపాక, పోరంకి, తాడిగడప, కానూరు గ్రామాల్లో అధికారులు, పాలక ప్రజాప్రతినిధుల కనుసన్నలలోనే అక్రమ భవన నిర్మాణాలు చక చకా జరిగిపోవటం ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది. మండలం విజయవాడ కమిషనరేట్‌ పరిధి కావటంతో రాజధాని ప్రాంతంలో భవన నిర్మాణాలకు సిఆర్‌డిఎ అధికారుల అనుమతి తప్పనిసరి. ఒక వేల నిర్మాణ అనుమతులు తీసుకున్నా గ్రౌండ్‌, మొదటి రెండు అంతస్థుల వరకే భవన నిర్మాణానికి అనుమతులు వుంటాయి. కానీ విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి బందరు రోడ్డుకు ఇరువైపులా పెనమలూరు మండలంలో కానూరు, తాడిగడప, పోరంకి గ్రామాల్లో బహుళ అంతస్థుల నిర్మాణాలు సిఆర్‌డిఎ అనుమతులు, ప్లానింగ్‌ లేకుండా అక్రమంగా జరుగుతుంటే సంబంధిత అధికారులు, పాలక ప్రజాప్రతినిధులు చోధ్యం చూస్తున్నారంటే లంఛాలు దండుకొని అవినీతి కూపంలో ఏ విధంగా కురుకుపోయారో కన్నులకు కట్టినట్లు తెలుస్తుంది. బందరు రోడ్డు విస్తరణ పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను ప్రొక్లెయిన్లతో రాత్రికి రాత్రే నేలమట్టం చేసారుగానీ అక్రమంగా నిర్మితమవుతున్న బహుళ అంతస్థుల భవనాలను కూల్చటానికి అధికారులు, పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారని అక్రమ బిల్డర్ల మాఫియాతో వారి బంధం మూడు అక్రమ లేఅవుట్లు, అరవై అక్రమ అపార్టుమెంటుల్లా విరాజిల్లుతుందని మండలంలోని ప్రజానీకం తీవ్రంగా విమర్శిస్తున్నారు..
Tags: Illegal illegal structures

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *