Natyam ad

అక్రమ బంగారం స్వాధీనం

శంషాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ అబుదాబి ప్రయాణికుడి నుంచి భారీగా అక్రమ బంగారం పట్టుకున్నారు. హైదరాబాద్- శంషాబాద్ నుండి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన శ్రీరంగప్ప అనే ప్రయాణికుడి వద్ద కిలోన్నర అక్రమ బంగారం వున్నట్లు అధికారులు గుర్తించారు. నింధితుడి లగేజీ స్క్రీనింగ్ చేసిన సిఐఎస్ఎఫ్ ఆధికారులు అందులో కిలోన్నర బంగారం బిస్కెట్లు గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకున్న సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు నింధితుని కష్టమ్స్ అధికారులకు అప్పగించారు. స్వదేశం నుండి విదేశాలకు అక్రమ బంగారం తరలించి పట్టుబడడం ఎయిర్ పోర్ట్ చరిత్రలోనే ఇదే మొదటి సారి. దుబాయ్, షార్జా, అబుదాబి నుండి అక్రమ బంగారం పట్టుబడడం చూసిన ఆధికారులు  మొదటి సారి ఇండియా నుండి విదేశాలకు అక్రమ బంగారం తరలించేందుకు ప్రయత్నించి పట్టుబడడం మొదటి సారి కావడం విశేషం.

 

Post Midle

Tags: Illegal possession of gold

Post Midle