అక్రమ ఇసుక, మట్టి తొవ్వకాలను నివారించాలి-  జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల ముచ్చట్లు:

జిల్లాలో అక్రమ ఇసుక, మట్టి తొవ్వకాలను అరికట్టాలని  జిల్లా కలెక్టర్ జి. రవి సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు.అక్రమ ఇసుక, మట్టి మైనింగ్ ధరణీ, మెగా పల్లెప్రకృతి వనం, ఓటరు జాబితా, నూతన రేషన్ కార్డులు  తదితర అంశాల పై  శుక్రవారం జిల్లా కలెక్టర్   తహసిల్దార్లతో,  రెవెన్యూ డివిజన్ అధికారులతో  టెలీ కాన్పరెన్సు నిర్వహించారు.
జిల్లాలోఅక్రమ ఇసుక , మట్టి రవాణా నివారించడానికి  పకడ్భంది  చర్యలు తీసుకోవాలని,అక్రమ మట్టి రవాణా చేసే వారి పై  కఠినంగా వ్యవహరించాలని  తెలిపారు.  గతంలో  సీజ్ చేసిన  ఇసుక ప్రభుత్వ నిర్మాణాలకు  మాత్రమే వినియోగించాలని కలెక్టర్ స్పష్టం చేసారు.సీజ్ చేసిన ఇసుక అక్రమంగా వినియోగిస్తున్నట్లు తేలితే   అత్యంత  కఠినంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్  హెచ్చరించారు.
ధరణీలో నూతనంగా అదనపు  ఫీచర్లను  చేర్చారని, వాటి ద్వారా అన్ని సమస్యలను  పరిష్కరించే అవకాశం ఉంటుందని  తెలిపారు.   ధరణీ ద్వారా వచ్చిన భూ సంబంధిత సమస్యలను క్షేత్రస్థాయిలో విచారణ చేసి    సరిచేయాలని  కలెక్టర్ అధికారులకు సూచించారు.జిల్లాలో ప్రస్తుతం 147 భూ సంబంధిత సమస్యలు   పెండింగ్ లొ ఉన్నాయని, అధికంగా మెట్ పల్లి ప్రాంతంలో కేసులు పెండింగ్ ఉన్నాయని, వీటి పై రెవెన్యూ డివిజన్ అధికారులు శ్రద్ద వహించి త్వరగా పరిష్కారమయ్యేలా   పర్యవేక్షణ  చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం మన జిల్లాలో ధరణీలో 163  పి.ఒ.బి, 40 మ్యూటేషన్, 19 ఆధార్ సీడింగ్   పెండింగ్ లో ఉన్నాయని,  వీటిని నిబంధనల మేరకు  త్వరగా  పరిష్కరించాలని  కలెక్టర్ సూచించారు.   సక్సెషన్ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం సూచించిన విధంగా  సదరు భూమి వివరాలను సంపూర్ణంగా  పరిశీలించాలని కలెక్టర్  తెలిపారు.
ప్రతి మండలంలో  మెగా పల్లెప్రకృతి వనాన్ని 10 ఎకరాల స్థలంలో  ఏర్పాటు చేస్తున్నామని, దీని కోసం అవసరమైన భూమి ఎంపిక చేయాలని  కలెక్టర్  తెలిపారు.  మెగా పల్లెప్రకృతి వనం కోసం గుర్తించిన స్థలం యొక్క సర్వే నెంబర్,  గ్రామం పేరు, భూమి పేరు(ప్రభుత్వ/వక్ఫ/దేవాదాయ)  తదితర వివరాలను  సాయంత్రం  వరకు మండలాల వారిగా  అందజేయాలని   కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో   పెండింగ్ లో ఉన్న  103  ఫారం 6ఎ దరఖాస్తులను బూత్ లెవల్ స్థాయి అధికారులతో క్షేత్రస్థాయిలో  విచారింపజేసి త్వరగా  పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.   అదే సమయంలో  జిల్లాలో  పెండింగ్ లో ఉన్న 700 నూతన ఓటరు  కార్డు డౌన్ లోడ్ ప్రక్రియను   పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో నూతన రేషన్  కార్డు మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని   కలెక్టర్ సూచించారు.  నూతనంగా 8 వేల  రేషన్ కార్డుల దరఖాస్తులలో  3 వేల దరఖాస్తుల ధృవీకరణ పూర్తి చేసామని, మిగిలినవి పెండింగ్ లో ఉన్నాయని  అధికారులు వివరించారు. పెండింగ్ లో ఉన్న 5 వేల రేషన్ కార్డులను త్వరితగతిన ధృవీకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.కోరుట్ల రెవెన్యూ డివిజన్ అధికారి, జగిత్యాల  రెవెన్యూ డివిజన్ అధికారి,  జిల్లాలో తహసిల్దార్లు,తదితరులు ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Illegal sand and clay mining should be prevented – District Collector G. Ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *