Illegal structures in the Horsley Hills

హార్సిలీ హిల్స్ లో అక్రమ నిర్మాణాలు

#రెవెన్యూ సిబ్బంది సహకారం?
#సబ్ కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
#లాక్ డౌన్ పేరుతో అధికారుల నిర్లక్ష్యం
#అనుమతి ఎవరిచ్చారు?

Date:04/05/2020

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లాలోని హార్సిలీ హిల్స్ లో అక్రమ నిర్మాణాలు జోరందుకొన్నాయి. హార్సిలీకొండ పై ప్రభుత్వానికి మినహా ప్రైవేటు వ్యక్తులకు సెంటు స్థలం కూడా లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ప్రభుత్వ శాఖలకు భూముల కేటాయింపులు చేసింది. హార్సిలీ హిల్స్ సహకార గృహనిర్మాణ సంఘానికి ప్రభుత్వం కొంత భూమిని విక్రయించింది. ఇది మినహా ప్రైవేటు వ్యక్తులకు ఇలాంటి కేటాయింపు జరగలేదు. అయితే లాక్ డౌన్ అమలు కోసం ప్రభుత్వ శాఖల అధికార యంత్రాంగం తలమునకలై ఉంది. ఈ సమయంలో ఎవరూ పట్టించుకోరు అన్న ఉద్దేశంతో కొందరు అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. వివాదాస్పద భూముల్లోనూ, కోర్టుల్లో కేసులు నడుస్తున్న భూముల్లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నిర్మాణాలకు అవసరమైన సామాగ్రిని ఏ అడ్డంకి లేకుండా తరలించు కుంటున్నారు. ఇప్పటికే పాత నిర్మాణాలను పడగొట్టి కొత్త నిర్మాణాలు పూర్తి చేశారు. కొత్తగా భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా, ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లినా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. దీనితో నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. లాక్ డౌన్ అమలులో ఉన్నందున ఎక్కువమంది ఒకచోట ఉండకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ నిర్మాణాలకు ఎక్కువ సంఖ్యలో కూలీలు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

#వీఆర్ఏల సహకారం

అక్రమ నిర్మాణాలను ఎప్పటికప్పుడు అడ్డుకోవాలని మదనపల్లి సబ్ కలెక్టర్ రెవెన్యూ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. కొండ కింద నుంచి పైకి నిర్మాణ సామాగ్రి వెళ్లకుండా వీఆర్ ఏ లను నియమించారు. మీరంతా ప్రేక్షకుల మాదిరి తయారయ్యారు. నిర్మాణ సామాగ్రి బహిరంగంగా కొండపైకి తరలిస్తున్నా పట్టించుకోవడం లేదు. వాటిని అదుపు చేయడంగాని, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం కానీ ఇవ్వడం లేదు. కొండ పై జరుగుతున్న నిర్మాణాలను ఆడ్డుకోకపోగా ఇక్కడ విషయాలను రహస్యంగా ఉంచుతున్నారు.

#అనుమతి ఎవరిచ్చారు

కొండపై ఏ చిన్న పని చేపట్టాలన్నా టౌన్ షిప్ కమిటీ చైర్మన్ అయిన మదనపల్లి సబ్ కలెక్టర్ అనుమతి తప్పనిసరి. అయితే ఒక్క అనుమతి లేకపోయినా వివాదాస్పద భూముల్లో నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. స్వేచ్ఛగా సాగుతున్న ఈ వ్యవహారం పై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోతే భారీ నిర్మాణాలు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇకనైనా అధికారులు స్పందిస్తారో, లేదో?

ఉద్యోగుల‌కు మాస్కులు త‌ప్ప‌నిస‌రి : జెఈవో పి.బ‌సంత్‌కుమార్‌

Tags: Illegal structures in the Horsley Hills

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *