జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టాలి

-సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కాగా అమలు చేయాలి

-నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తే చర్యలు

-జిల్లా కలెక్టర్ యం. అభిషిక్త్ కిషోర్

రాయచోటి ముచ్చట్లు:

జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టాలి. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యం. అభిషిక్త్ కిషోర్ జిల్లాస్థాయి ఇసుక కమిటీ సభ్యులను ఆదేశించారు.బుధవారం రాయచోటి కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఉన్న అన్ని ఇసుక రీచ్ లను తనిఖీ చేసి ఎక్కడైనా అక్రమంగా ఇసుక తరలిస్తున్న లేదా ఎక్కడైనా రీచ్ లలో మిషన్లు పెట్టి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుంటే అట్టి వివరాలపై జిల్లా కలెక్టర్లకు ఈనెల 21 లోపు నివేదిక సమర్పించాలని మైనింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ ఆదేశాలను జారీ చేసి ఉన్నారు.

 

 

ఈ మేరకు జిల్లాలో అనుమతులు ఉన్న ఇసుక రీచ్ లు మరియు అనుమతుల కాల పరిమితి తీరిపోయిన ఇసుక రీచులను కూడా సభ్యులందరూ తనిఖీ చేసి రిపోర్టు సమర్పించడం జరిగిందన్నారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణాలను అరికట్టడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా స్థాయి కమిటీ సభ్యులు మార్గదర్శకాలు మేరకు తరచు ఇసుక రీచ్ లను సందర్శించాలన్నారు. అలాగే మండల స్థాయిలో కూడా తాసిల్దార్లు, ఆర్డీవోలు కూడా సిబ్బందిని నియమించి ఇసుక రీచ్ లో 24/7 ప్రకారం పర్యవేక్షణ చేయాలన్నారు. కమిటీలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంగా తనిఖీలు చేసి అక్రమ ఇసుక రవాణాన్ని అరికట్టేందుకు బాధ్యతాయుతంగా కృషి చేయాలని సూచించారు. అనంతరం వివిధ అంశాలలో తగు సూచనలు జారీ చేశారు.ఈ సమావేశంలో జిల్లా మైనింగ్ అధికారి డి రవి ప్రసాద్, పోలీసు, రెవెన్యూ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బోర్డ్, ట్రాన్స్పోర్ట్, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్,ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్ తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 

Tags:Illegal transportation of sand should be completely stopped in the district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *