Natyam ad

గిరిజన విద్యార్దినులకు అస్వస్థత

వరంగల్ ముచ్చట్లు:


వరంగల్ జిల్లాలోని  వర్ధన్నపేట మండల కేంద్రంలోనీ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థకు గురి అయ్యారు. విద్యార్థులకు ఇంత జరిగినా ఎవరు పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తమ పిల్లలను ఇక్కడ ఉంచి చంపుకోవడమేనని తల్లిదండ్రులు అష్టలో ఉన్న మిగతా విద్యార్థులను తీసుకొని పెట్టారు సర్దుకుని వారి ఇంటికి వెళ్ళిపోతున్నారు కొందరు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కనీసం హాస్టల్లో జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడం లేదంటూ ఆరోపించారు.  మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాస్టల్ నుంచి విద్యార్థుల పెట్టెలు సర్దుకుని పిల్లలతో సహా వారి సొంత గ్రామానికి వెళ్ళిపోతున్నారు .వర్ధన్నపేట ఆసుపత్రిలో వైద్యులు పిల్లలకు చికిత్స అందిస్తుండగా 22 మంది విద్యార్థులు వర్ధన్నపేట ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.  మరో 20 మంది చికిత్స చేయించుకుని వెళ్లిపోయారు. 13 మంది విద్యార్థులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ పిల్లలను ఇక్కడ హాస్టల్లో ఉంచమని  వారంటున్నారు. విద్యార్థులకు నిత్యం పురుగుల అన్నం వస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తల్లిదండ్రులు వారి పెట్టెలు తీసుకొని ఇంటి ముఖం పడుతున్నారు.

 

Tags: Illness for tribal students

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.