హెల్త్ వర్కర్లకు అస్వస్థతకు

Date:21/01/2021

కామారెడ్డి ముచ్చట్లు:

కామారెడ్డి జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఏఎన్ఎం, ఆశా వర్కర్లు అస్వస్థతకు గురయ్యారు. గురువారం వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం కడుపునొప్పితో పాటు వాంతులతో అస్వస్థతకు గురైన ఏఎన్ఎంను వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
అస్వస్థకు గురైన ఏఎన్ఎం బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి సబ్ సెంటర్లో పనిచేస్తున్న సుజాతగా గుర్తించారు. చికిత్స అనంతరం బుధవారం సాయంత్రం ఏఎన్ఎం సుజాత డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయారు. నాగిరెడ్డిపేట మండలం జలాల్ పూర్ గ్రామానికి చెందిన ఆశా వర్కర్ వడ్లూరి భూదేవి ఈ నెల 19 న కోవిషిల్ టీకా వేసుకుంది. టీకా వేసుకున్న 10 నిమిషాలకు కళ్ళు తిరిగి, వాంతులు కావడంతో పాటు విపరీతమైన దమ్ముతో ఇబ్బంది పడింది. వెంటనే ఆమెను ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది.

పుంగనూరులో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పట్టాలపై పరిశీలన

Tags: Illness to Health Workers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *