నలుగురి జీవితాల్లో వెలుగులు

Illumine in four lives

Illumine in four lives

Date:13/07/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
అవయవదానం మరో నలుగురికి పునర్జన్మను ప్రసాదించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు ఇక లేదన్న బాధలో ఉండి కూడా.. మరణించిన తమ కూతురి అవయవాలను దానం చేసిన కుటుంబ సభ్యులు మరో నలుగురికి ప్రాణం పోసి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. ఘట్‌కేసర్‌ ప్రాంతంలోని రాంపల్లి ఐకేగూడలో నివసించే శృతి (26) ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పని చేస్తున్నారు.  తల్లి మాధవితో కలిసి ద్విచక్రవాహనంపై ఈసీఐఎల్‌ వెళ్తుండగా కుషాయిగూడ వద్ద వీరి వాహనాన్ని గుర్తుతెలియని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మాధవి అక్కడికక్కడే మృతి చెందింది. శృతి తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌‌లోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆమెకు రెండు రోజులపాటు చికిత్స చేయించారు. అయితే ఆమె బ్రెయిన్‌డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యుల సమ్మతంతో ఆమె శరీరం నుంచి మూత్రపిండాలు, కళ్లు, కాలేయం సేకరించారు. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఆ అవయవాలను అమర్చి, వారికి పునర్జన్మ ప్రసాదించారు. ఇందుకు జీవన్‌దాన్‌ ప్రతినిధులు తోడ్పాటునందించారు.
నలుగురి జీవితాల్లో వెలుగులు https://www.telugumuchatlu.com/illumine-in-four-lives/
Tags:Illumine in four lives

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *