నేను ఎంతో ఇష్ట‌ప‌డే ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన‌ శేఖ‌ర్ క‌మ్ముల గారితో క‌లిసి వ‌ర్క్ చేసేందుకు ఎగ్జ‌యిటెట్ గా ఉన్నా – కోలివుడ్ సూప‌ర్‌స్టార్ ధ‌నుష్‌.

 

 

సినిమా ముచ్చట్లు:

నారాయణ్ దాస్ కె నారంగ్ – పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాత‌లుగా శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి త్రిభాషా చిత్రం.

 

నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్స్ సూప‌ర్‌స్టార్ ధ‌నుష్‌, సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కాంభినేష‌న్‌లో తమిళ, తెలుగు మరియు హిందీ భాషలలో ఏకకాలంలో ఒక  చిత్రం రూపొంద‌నుంది. ఈ మూవీకి నారాయణ్ దాస్ కె నారంగ్ – పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాతలు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ లో త్రిభాషా చిత్రంగా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కనుంది. సోనాలి నారంగ్  స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దివంగత సునితా నారంగ్ పుట్టినరోజు సందర్భంగా జూన్‌18న‌  ప్రకటించారు. క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన సోషల్ మీడియాలో అలజ‌డి సృష్టించింది. దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాతలు నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావులతో కలిసి పనిచేసినందుకు ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్న‌ట్లు ధ‌నుష్ తెలిపారు. `నేను ఎంతో ఇష్ట‌ప‌డే ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన శేఖ‌ర్ క‌మ్ముల గారితో కలిసి వ‌ర్క్ చేయ‌బోతున్నందుకు చాలా  ఆనందంగా ఉంది. అలాగే ఈ త్రిభాషా కోసం ఎస్‌విసి ఎల్ఎల్‌పి బ్యానర్‌లో నారాయణ దాస్ నారంగ్ సర్ మరియు పుస్కూరు రామ్‌మోహన్ రావు సర్ తో క‌లిసి ప‌ని చేయ‌డం సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్  కోసం ఎదురుచూస్తున్నాను“ అని ధ‌నుష్ ట్వీట్ చేశారు. ఈ సినిమా కోసం దేశంలోనే అత్యున్న‌త‌మైన న‌టులు, టెక్నీషియ‌న్స్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది చిత్ర యూనిట్‌. త్వ‌ర‌లోనే వారి వివ‌రాలు ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభంకానున్న ఈ ప్రాజెక్ట్ యొక్క మ‌రిన్ని వివరాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.
తారాగ‌ణం: ధ‌నుష్\

 

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:I’m excited to work with Shekhar Kammula, one of my favorite directors – Kollywood superstar Dhanush.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *