I'm going to jail for Pakistan people

పాకిస్థాన్‌ ప్రజల కోసమే నేను జైలుకు వెళ్తున్నా

Date:13/07/2018/
దుబాయ్‌ ముచ్చట్లు:
పాకిస్థాన్‌ ప్రజల కోసమే నేను జైలుకు వెళ్తున్నా. భవిష్యత్‌ తరాల కోసమే నేను ఈ త్యాగం చేస్తున్నాను. ఇటువంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు’ అని యూఏఈలోని అబుదాబి విమానాశ్రయంలో పాక్‌కు వెళ్లే విమానం ఎక్కుతూ పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.షరీఫ్‌ అన్నారు. నేడు ఆయన లండన్‌ నుంచి పాక్‌ వస్తున్నారు. ‘నన్ను నేరుగా జైలుకే తీసుకెళ్తారు. అవినీతి కేసులో దోషిగా తేలిన మాజీ ప్రధాని షరీఫ్‌, ఆయన కుమార్తె మరియంలను లాహోర్‌ విమానాశ్రయంలోనే అరెస్టు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం దాదాపు పది వేల మంది ప్రత్యేక భద్రతా బలగాలు విమానాశ్రయం వద్ద మోహరించారు. షరీఫ్‌ను జైలుకు తరలించేందుకు ప్రత్యేకంగా రెండు విమానాలను విమానాశ్రయం వద్ద సిద్ధంగా ఉంచారు.పనామా పత్రాల కుంభకోణానికి సంబంధించిన ఒక కేసులో ఆయనకు పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 80లక్షల పౌండ్ల జరిమానా విధిస్తూ ఇస్లామాబాద్‌లోని అవినీతి నిరోధక కోర్టు తీర్పునిచ్చింది. నేరం చేసేలా ప్రోత్సహించినందుకు గాను ఆయన కుమార్తె మరియం‌కు ఏడేళ్ల జైలు శిక్ష, 20లక్షల పౌండ్ల జరిమానాను విధించారు. విచారణ అధికారులకు సహకరించనందుకు గాను ఆమెకు మరో ఏడాది జైలు శిక్షను విధించారు.
పాకిస్థాన్‌ ప్రజల కోసమే నేను జైలుకు వెళ్తున్నా https://www.telugumuchatlu.com/im-going-to-jail-for-pakistan-people/
Tags:I’m going to jail for Pakistan people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *