నేను చాలా బీజీ : చార్మీ

Date:27/03/2018
చెన్నై ముచ్చట్లు:
నీతోడు కావాలి’ అంటూ తెలుగు చిత్ర పరిశ్రమకు 14 ఏళ్ల వయసులో పరిచయం అయిన హీరోయిన్ ఛార్మి.. ఇప్పుడు ఏతోడు అవసరం లేదంటూ కుండబద్దలు కొట్టేసింది. శ్రీ ఆంజనేయం, గౌరీ, మంత్ర లాంటి సినిమాలతో తెలుగులో చాలా సినిమాలు చేసినప్పటికీ ఆమె ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ చేరలేదు. ఆ తరువాత ఐటమ్ సాంగ్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరియర్‌ను మలుపు తిప్పుకునే ప్రయత్నం చేసినా ఛార్మి కెరియర్ గాడిన పడలేదు. అయితే ఇన్నేళ్ల గ్లామర్ కెరియర్‌లో ఛార్మి రూమర్స్‌ విషయంలో టాప్ ప్లేస్‌తో పోటీ పడుతూనే ఉంది. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో ప్రేమాయణం తరువాత.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌తో డేటింగ్‌లో ఉందని.. ఈ ప్రేమపక్షులు ప్రేమలోకంలో విహరిస్తున్నారని.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే పెళ్లికి ముందే పెటాకులైంది వీరి ప్రేమవ్యవహారం అంటూ వార్తలు నడిచాయి. అయితే దేవిశ్రీ పేరును ఎక్కడా ప్రస్తావించకపోయినప్పటికీ.. తాను ప్రేమలో విఫలమైనట్టు మీడియాకి వివరించింది. తాజాగా మరోసారి ప్రేమ, పెళ్లిపై సన్సేషనల్ కామెంట్స్ చేసి వార్తల్లోకొచ్చింది ఛార్మి.
Tags:I’m very angry: charmi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *