ఉత్తర మొదటి పాటను విడుదల చేసిన ఎస్ వీ కృష్ణ రెడ్డి

Date:18/07/2018
హైదారాబాదు ముచ్చట్లు:
లైవ్ ఇన్ సి క్రియేషన్స్,  గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్  పతాకం పై ఎస్ ఆర్ తిరుపతి  దర్శకత్వం లో  శ్రీరామ్, కారుణ్య కాథరిన్  హీరో హీరోయిన్ గా అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలో ఎస్ ఆర్ తిరుపతి, శ్రీపతి గంగాదాస్ నిర్మాణంలో  నిర్మించబడుతున్న చిత్రం ఉత్తర . ఈ సినిమా కి సంభందించి మొదటి పాటను,  మోషన్ పోస్టర్ ను  ప్రముఖ దర్శకులు ఎస్ వీ కృష్ణ రెడ్డి   విడుదల చేసారు.ఎస్ వీ కృష్ణ రెడ్డి  ఈ ఉత్తర చిత్రంలోని “ఓ చూపే” అనే పాటను విడుదల చేసారు, తర్వాత అయన మాట్లాడుతూ “ఉత్తర సినిమాలోని ఈ పాట చాల బాగుంది. హీరో హీరోయిన్ శ్రీరామ్, కారుణ్య కాథరిన్ ఇద్దరు చాల బాగున్నారు. పాట చిత్రీకరణ చాల బాగుంది, లొకేషన్స్ చాల బాగున్నాయి. ఈ సినిమా విజయవంతం కావాలి” అని కోరుకున్నారు.
దర్శకనిర్మాతలు మాట్లాడుతూ “మా సినిమా లోని మొదటి పాటను ఎస్ వీ కృష్ణ రెడ్డి గారు విడుదల చేయటం చాలా సంతోషం గా ఉంది. కొత్తవాళ్ళమైనా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న  దర్శకులు ఎస్ వీ కృష్ణ రెడ్డి గారికి మా కృతఙ్ఞతలు. త్వరలో షూటింగ్ పూర్తిచేసుకుని ఆడియో విడుదల చేస్తాం” అని తెలిపారు.
నటి నటులు : శ్రీరామ్, కారుణ్య కాథరిన్, అజయ్ ఘోష్
ఉత్తర మొదటి పాటను విడుదల చేసిన ఎస్ వీ కృష్ణ రెడ్డి https://www.telugumuchatlu.com/s-v-krishna-reddy-released-the-first-song-of-the-north/
Tags:S.V Krishna Reddy released the first song of the North

విద్యాబాలన్ ను ఆత్మీయంగా స్వాగతించిన ఎన్.టి.ఆర్ కుటుంబం 

Date:18/07/2018
హైదారాబాదు ముచ్చట్లు:
బాలీవుడ్ నటీమణి విద్యాబాలన్ నేడు ఎన్.టి.ఆర్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి పూల బొకేతో విద్యాబాలన్ కు స్వాగతం తెలిపారు. అలాగే.. నందమూరి వంశం రివాజు ప్రకారం ఆమెకు చీరను బహుకరించారు. ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఆయన సతీమణి బసవతారకం పాత్ర పోషించనున్న విద్యాబాలన్ ఎన్.టి.ఆర్ కుటుంబ సభ్యుల నుంచి ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవడంతోపాటు.. లోకేశ్వరిని అడిగి బసవతారకం వ్యవహారశైలి ఎలా ఉంటుంది, ఆమెకు ఇష్టమైన విషయాలేమిటి, హాబీస్ ఏమిటి అనేవి అడిగి తెలుసుకున్నారు విద్యాబాలన్. ఈ ఆత్మీయ పరిచయ తేనీటి విందులో నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర దేవి, ఆయన చిన్నకుమార్తె తేజస్విని, ఆయన చిన్న అల్లుడు శ్రీభరత్ పాలుపంచుకున్నారు.
నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన విద్యాబాలన్ బుధవారం నుంచి ఎన్.టి.ఆర్ సెట్స్ లో పాల్గొననున్నారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. విద్యాబాలన్ ఓ వైవిధ్యమైన గెటల్ లో కనిపించనున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. నందమూరి బాలకృష్ణ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని సాయికొర్రపాటి, విష్ణు ఇందూరు సమర్పిస్తున్నారు. నటీనటులు:నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నరేష్ వి.కె, మురళీశర్మ, ప్రకాష్ రాజ్ తదితరులు..
విద్యాబాలన్ ను ఆత్మీయంగా స్వాగతించిన ఎన్.టి.ఆర్ కుటుంబం https://www.telugumuchatlu.com/ntrs-family-which-was-welcomed-by-vidya-balan/
Tags:NTR’s family which was welcomed by Vidya Balan

వడ్డించే వాడు మనవాడైతే ఏక్కడ కుర్చుంటేనేమి!

Date:18/07/2018
హైదారాబాదు ముచ్చట్లు:
వడ్డించే  వాడు  మనవాడైతే బంతి లో ఏక్కడ కూర్చున్న ముక్క పడుతడన్నది సామెత.అలాగే ముఖ్యమంత్రే మనవాడైతే సొంత పత్రికలకు వచ్చే ప్రకటనలకు కొరత ఉంటదా?. అచ్చం ఇప్పుడు తెలంగాణలో అదే సాగుతోంది. సర్కులేషన్ పరంగా అగ్రశ్రేణి పత్రికల కంటే కెసీఆర్ కుటుంబ సభ్యులకు చెందిన నమస్తే తెలంగాణ, టీ ఛానల్ లు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటనల ఆదాయంలో మాత్రం దూసుకెళుతున్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న సమాచారం ప్రకారం ఈ విషయాలను ద హూట్ అనే వెబ్ సైట్ సమగ్ర కథనాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రే మీడియా అధినేత అయితే అనే ‘క్యాప్షన్’తో ఈ వివరాలు పొందుపర్చారు. ఉస్మానియా యూనివర్శిటీ మాజీ  ఫ్రొఫెసర్, మీడియా విశ్లేషకురాలు పద్మజా షా ఈ వివరాలతో ఓ స్టోరీ అందించారు. ఆ వివరాలు ఇవే. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు చెందిన మీడియా సంస్థలకు భారీ ఎత్తున ప్రకటన రూపంలో ఆదాయం అందజేయటం అవినీతి అంటారా?. లేక అధికారాన్ని దుర్వినియోగం చేయటం కిందకు వస్తుందా? అన్న ప్రశ్నలను లేవనెత్తారు.2016 ఏప్రిల్-2017 మార్చి కాలంలో సర్కులేషన్ పరంగా అగ్రస్థానంలో ఉన్న ఈనాడుకు 271 లక్షల రూపాయల ఆదాయం రాగా, ఇదే కాలంలో నమస్తే తెలంగాణకు ఈనాడు కంటే తక్కువే 262 లక్షల రూపాయల యాడ్స్ వచ్చాయి ప్రభుత్వం నుంచి. ఈ కాలంలో సాక్షికి 192 లక్షలు, ఆంధ్రజ్యోతికి 45.6 లక్షల రూపాయల ప్రకటనలు మాత్రమే ఇచ్చారు. కానీ 2017 ఏప్రిల్-2018 ఫిబ్రవరి వరకూ చూసుకుంటే ఈనాడు ఆదాయం 271.9 లక్షల రూపాయల వద్దే ఉంది. ఇదే కాలంలో సాక్షికి 207 లక్షలు, ఆంధ్రజ్యోతికి 135 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. నమస్తే  తెలంగాణ ఆదాయం  మాత్రం ఏకంగా 1281 లక్షలకు చేరింది. అంటే పెరుగుదల శాతం 387 శాతం అన్న మాట. 2017 జనవరి నుంచి 2018 మే వరకూ చూసుకుంటే ఎలక్ట్రానిక్ మీడియా విషయానికి వస్తే అధికారిక ఛానల్ అయిన టీన్యూస్ దే హంగామా అని చెప్పొచ్చు. ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఎక్కువ ఆదాయం సీఎం కుటుంబ సభ్యులకు చెందిన సంస్థకే కావటం విశేషం.అయితే సదరు వెబ్ సైట్ లో  లేని విషయం మరొకటి ఉంది. మామూలుగా ప్రచారం చేసుకోవటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని మించిన వారు ఒకరుండరు అనే అభిప్రాయం ఉండేది. కానీ పత్రికలకు ప్రకటనల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని మించిపోయారనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. రాష్ట్రానికి చెందిన పత్రికలకే కాకుండా..జాతీయ స్థాయి, అంతర్ రాష్ట్ర పత్రికలకు కూడా ప్రకటనలు ఇఛ్చి కోట్లాది రూపాయల వ్యయం చేశారు.
వడ్డించే వాడు మనవాడైతే ఏక్కడ కుర్చుంటేనేమి! https://www.telugumuchatlu.com/if-anyone-wants-to-come-to-us/
Tags:If anyone wants to come to us

బీజేపీ, వైకాపాలపై మండిపడ్డ యనమల 

Date:18/07/2018
అమరావతి ముచ్చట్లు:
జమిలి ఎన్నికలనేది రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్య విరుద్ధమని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బీజేపీ, వైసీపీపై పత్రికా ప్రకటనలో యనమల ధ్వజమెత్తారు. కేంద్రం నిధులపై బిజెపి నేతలు శ్వేత పత్రం అడగటం హాస్యాస్పదం. కేంద్రం ఇచ్చింది, ఖర్చుచేసింది పారదర్శకం. ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతున్నామని అన్నారు. కేంద్రం నుండి రావాల్సినవాటి గురించి మాట్లాడండి. నాలుగేళ్లుగా ఏపికి ఇచ్చిందే అరకొర..పైగా వాటికి కూడా శ్వేతపత్రం కావాలంటారా అని అడిగారు. చట్టం ప్రకారం రావాల్సినవన్నీ ఇచ్చాక అప్పుడు అడగండి శ్వేతపత్రం. ఇచ్చిందేమో గోరంత, అడిగేదోమో శ్వేతపత్రం..ఇంతకన్నా విడ్డూరం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. బిజెపి నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రజల దృష్టి మళ్ళించాలని చూస్తున్నారు. రోడ్లు,ఇళ్లు,ఉపాధి నిధులు దేశం మొత్తం ఇచ్చారు.  కామన్ కేటగిరి కింద ఏపికి ఎంత ఇచ్చారో కేంద్రాన్ని చెప్పమనండని అన్నారుజ ఏ కేటగిరి కింద ఎంత ఇచ్చారో కేంద్రాన్నే ప్రకటించమనండి. ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ కు ఎంత ఇచ్చారు? వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు ఎంత ఇచ్చారు?రాజస్థాన్ పెట్రో కాంప్లెక్స్ కు ఎంత ఇచ్చారు..?కాకినాడ పెట్రోకాంప్లెక్స్ కు ఎంత ఇచ్చారు..? బుందేల్ ఖండ్ కు ఎంత ఇచ్చారు..? ఉత్తరాంధ్ర,సీమ జిల్లాలకు ఎంతఇచ్చారు..?  ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన నిధులకు ఏపీకి ఇచ్చిన నిధులకు ఏమైనా పొంతన ఉందా..?  డిఎంఐసికి,బుల్లెట్ ట్రైన్ కు ఇచ్చినదానికి, మనకు ఏమైనా ఫొంతన ఉందా..? బెంగళూరు,ముంబై రైల్వేలకు ఇచ్చిన దానికి, మనకు ఇచ్చిన దానికి పొంతన ఉందా..?  బిజెపి రాష్ట్రాలకు నాలుగేళ్లుగా ఎంత ఇచ్చారు..? బిజేపియేతర రాష్ట్రాలకు ఎంత ఇచ్చారు..? అన్ని వివరాలు కేంద్రాన్ని వెల్లడించమనండని అన్నారు. విభజన చట్టం కింద ఇవ్వాల్సినవి మన రాష్ట్రానికే ప్రత్యేకం. వాటిని ఇతర రాష్ట్రాలతో పోల్చకూడదు అది ఆంధ్రప్రదేశ్ కే ప్రత్యేక చట్టం అని గుర్తుంచుకోవాలని అన్నారు. కామన్ కేటగిరిలో ఏపికి అన్యాయం చేశారు. ప్రత్యేక కేటగిరిలో కూడా ఏపికి అన్యాయమే చేశారని అయన అన్నారు. ఏ  ముఖం పెట్టుకుని బిజెపి నేతలు శ్వేతపత్రం అడుగుతున్నారు..? ‘వన్ నేషన్-వన్ టాక్స్’ అనేది బిజెపి ముసుగు మాత్రమేనని అయన విమర్శించారు.
బీజేపీ, వైకాపాలపై మండిపడ్డ యనమల https://www.telugumuchatlu.com/the-bjp-and-the-yanamala/
Tags:The BJP and the Yanamala

కడపలో సీఐల బదిలీలు

Date:18/07/2018
కడప ముచ్చట్లు:
కడప  జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మంది పోలీసు సిఐల బదిలీలు జరిగాయి.  రెండేళ్ళ కు పైగా ఒకే స్టేషన్ లో పనిచేస్తున్న వారికి స్థానచలనం కలిగించారు.  కడప చిన్నచౌక్ సిఐ రామకృష్ణ ను విఆర్ కి బదిలీచేసి అక్కడికి కొత్త సిఐ గా పద్మనాభన్ ను నియమించారు.  సీసీఎస్ సిఐ నారాయణప్పను కడప రూరల్ సిఐ గా,  కడప అర్బన్ సిఐ గా పాణ్యం నుంచి పార్థసారథి రెడ్డి, ఆదోని 3 టౌన్ సిఐ చంద్రశేఖర్ ను జమ్మలమడుగు సిఐ గా  బదిలీ చేసారు.  స్పెషల్ బ్రాంచ్ సిఐ గా ఉన్న ఈశ్వర్ రెడ్డి, పిసిఆర్ లో సిఐ గా ఉన్న బలస్వామి రెడ్డి లను విఆర్ కు బదిలీ చేసారు.  విఆర్ లో ఉన్న యుగంధర్ ను కడప సీసీఎస్ సిఐ, కర్నూల్ విఆర్ లో ఉన్న అబ్దుల్ గౌస్ ను కడప పిసిఆర్ సిఐ గా బదిలీ చేసారు.
కడపలో సీఐల బదిలీలు https://www.telugumuchatlu.com/cia-transfers-in-kadapa/
Tags:CIA transfers in Kadapa

రాయదుర్గంలో మంత్రి కాలవ పర్యటన

Date:18/07/2018
అనంతపురం ముచ్చట్లు:
గ్రామదర్శిని, గ్రామవికాసం కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు రాయదుర్గం పట్టణంలోని 1వ వార్డులో మంత్రి కాలవ శ్రీనివాసులు పర్యటించారు.  పార్టీ జెండాను ఆవిష్కరించి వార్డు పర్యటన ప్రారంభించిన మంత్రి వార్డులో డ్రైనేజీ నిర్మాణం పనులు పరిశీలించారు. ఎన్టీఆర్ పట్టణ గృహాల నిర్మాణాన్ని పరిశీలించి, లబ్దిదారులతో మాట్లాడారు. బిల్లుల చెల్లింపుపై కుడా లబ్దిదారులతో ఆరాతీసారు. శాంతినగర్లో జీన్స్ రెడీమేడ్ దుస్తుల తయారీ పరిశ్రమను సందర్శించి బాలకార్మికులను గుర్తించిన మంత్రి  ఆ బాలలను తక్షణమే బడిలో చేర్పించి వారి సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే చేపట్టేలా చర్యలు చేపడతామని అన్నారు.
రాయదుర్గంలో మంత్రి కాలవ పర్యటన https://www.telugumuchatlu.com/ministers-visit-to-the-writers-department-2/
Tags:Minister’s visit to the Writers Department

రెగ్యులర్ టీచర్లు తప్పనిసరి

 Date:18/07/2018
హైదారాబాదు ముచ్చట్లు:
 రాష్ట్రంలో ఇటీవల జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల వల్ల పాఠశాలల్లో టీచర్లు లేకుండా పోయారు. దీంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు తక్కువగా ఉన్న పాఠశాలల్లోని ఉపాధ్యాయులను  ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు డిప్యూటేషన్పై పంపించాలని నిర్ణయించారు.  ఈమేరకు ఆర్జేడీ, డీఈవోలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ప్రైమరీ స్కూల్లో ఒకరు, అప్పర్ ప్రైమరీలో ఇద్దరు, హైస్కూల్లో ముగ్గురు టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల చదువులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలిచ్చారు. సంబంధిత మండలంలో గాని, పక్క మండలం లో గాని జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ లేదా తక్కువ ఎన్రోల్మెంట్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను  డెప్యూటషన్స్ పై పంపాలని  ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయినప్పటికీ  ఉపాధ్యాయులకు దొరకని పరిస్థితి ఏర్పడితే,  అక్కడ నుండి ఇటీవల బదిలీ అయిన టీచర్లను మళ్ళీ ఆ స్కూలుకి డిప్యుటేషన్ ఫై పంపించాలని ఆదేశించారు.  ఏ ప్రభుత్వ పాఠశాల కూడా రెగ్యులర్ టీచర్ లేకుండా ఉండొద్దని నిర్ణయించారు.
రెగ్యులర్ టీచర్లు తప్పనిసరి https://www.telugumuchatlu.com/regular-teachers-are-mandatory/
Tags:Regular teachers are mandatory

ఆగష్టు 15వ తేదీలోగా కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. ..  బడా హొటళ్ల ముందు గాంధీ గిరి

Date:18/07/2018
హైదారాబాదు ముచ్చట్లు:
రోజుకు 50 కిలోల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నారా! అయితే ఆగష్టు 15వ తేదీలోగా కంపోస్ట్ ఎరువుల తయారీ యూనిట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.”  ఇది  జీహెచ్ఎంసీ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, కళ్యాణమండపాలు, బాంకెట్ హాళ్లకు నిర్థారించిన గడువు.  2016 వ్యర్థపదార్థాల నిర్వహణ నిబంధనలను అనుసరించి 50 కిలోల వ్యర్థాలను రోజుకు ఉత్పత్తి చేసే ప్రతి సంస్థ తప్పని సరిగా అంతర్గతంగా కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు నగరమేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ డా.బి.జనార్థన్ రెడ్డిలు నగరంలోని హోటళ్లు,  రెస్టారెంట్లు, ఫంక్షన్హాళ్ల యజమానులతో సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికి కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న బడా హొటళ్లు, రెస్టారెంట్ల వద్ద నేడు జీహెచ్హెంసి అధికారులు, సిబ్బంది గాందీ గిరి నిర్వహించారు. వెంటనే కాంపొస్ట్ యూనిట్లను యెర్పాటు చేయాలని కోరుతూ నిరసనలు వ్యక్తం చెసారు. రోజుకు 50 కిలోల కన్నా అధిక మొత్తంలో చెత్తను ఉత్పత్తి చేసే వాటిని బల్క్ గార్బెజ్ జనరేటరుగా ప్రకటించారు. ఈ బల్క్ గార్బేజ్ ఉత్పత్తి సంస్థలన్నీ ఆగష్టు 15వ తేదీలోగా తప్పనిసరిగా కంపోస్ట్ పిట్లను గానీ, కంపోస్ట్ యంత్రాలను గానీ ఏర్పాటు చేసుకోవాలని, లేనట్టయితే తనిఖీలు నిర్వహించి తగు చర్యలను చేపట్టడం జరుగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. మార్కెట్లో లభ్యమయ్యే కంపోస్ట్ ఎరువుల తయారీ యంత్రాల ధరలు, అవి దొరికే ప్రాంతాలు, విక్రయించే సంస్థల వివరాలను జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ప్రదర్శించారు. గ్రేటర్ హైదరాబాద్లో మరింత మెరుగైన పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు జీహెచ్ఎంసీ చేపడుతున్న చర్యలకు చేయుతనివ్వాలని ఇందుకు గాను వెంటనే కాంపొస్ట్ యూనిట్లు యెర్పాటు చేయాలని జీహెచ్హెంసి మరోమారు కోరింది. నేడు జరిపిన గాందీ గిరి తో  వెంటనే కంపోస్ట్ యూనిట్లు  ఏర్పాటు చేయనున్నట్లు పలు హొటళ్ యజమానులు అంగీకరించారు.
ఆగష్టు 15వ తేదీలోగా కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. ..  బడా హొటళ్ల ముందు గాంధీ గిరి https://www.telugumuchatlu.com/compost-units-should-be-established-by-august-15th-gandhi-giri-before-the-big-places/
Tags:Compost units should be established by August 15th. Gandhi giri before the big places