పెట్రోల్ ధరలకు రెక్కలు

Date:14/05/2018

 

బెంగళూర్ముచ్చట్లు:
కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ అలా ముగిసిందో లేదో ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. దాదాపు మూడు వారాల తర్వాత పెట్రోలియం సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో రోజువారీ ధరల సమీక్ష విధానం అమల్లోకి వచ్చిన తర్వాత 19 రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులేకపోవడం విశేషం. అయితే శనివారం పోలింగ్ ముగియడంతో సోమవారం యథావిధిగా లీటరు పెట్రోల్‌పై 17 పైసలు, డీజిల్‌పై 21 పైసలను పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధానిలో లీటరు పెట్రోలు రూ. 74.80, డీజిల్ రూ. 66.14లకు చేరుకున్నాయి. డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకోగా, పెట్రోల్ మాత్రం 56 నెలల గరిష్ఠానికి చేరుకుంది. కర్ణాటకలో బీజేపీ లబ్ది కోసమే ఈ మూడు వారాలు పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచలేదని వస్తోన్న ఆరోపణలను ఐఓసీ ఛైర్మన్ సంజీవ్ సింగ్ కొట్టిపారేశారు. ధరల పెరుగుదలపై వినియోగదారుల్లో నెలకున్న భయాందోళనలను నివారించడానికే తాత్కాలికంగా ధరల సమీక్షను నిలిపివేస్తామని గతంలోనే ప్రకటించామని ఆయన తెలిపారు. మరోవైపు ధరల పెరుగుదలపై కేంద్రంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ రేట్లు పెద్ద ఎత్తున పెరిగాయని ఆరోపిస్తున్నాయి. 2014- 2016 మధ్య కాలంలో 9 సార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచారని, దీనివల్ల ప్రభుత్వానికి లక్ష కోట్లకు పైగానే ఆదాయం సమకూరిందని విమర్శించారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో గతేడాది అక్టోబరులో కంటి తుడుపు చర్యగా లీటరుపై రూ.2 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారని విమర్శలు గుప్పిస్తున్నారు. గుజరాత్ ఎన్నికలు ఉన్నందు వల్ల 2017 డిసెంబరు తొలి రెండు వారాల్లో రోజుకు లీటరుపై 1- 3 పైసలు వంతున ధరలను ఐఓసీ తగ్గిస్తూ వచ్చింది. ఆ ఎన్నికలు ముగిసిన మర్నాడే మళ్లీ పెంపుబాట పట్టాయి.
Tags:Wing petrol prices

తిరుమలలో పవన్ పర్యటన

Date:14/05/2018
తిరుమల ముచ్చట్లు:
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుమల పర్యటన కొనసాగుతోంది. ఇవాళ పవన్ జాపాలి ఆంజనేయుడ్ని దర్శించుకున్నారు. స్వామివారికి జనసేనాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు పవన్‌కు తీర్థప్రసాదాలు అందజేసి…స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. తర్వాత జనసేన అధినేత అక్కడే అడవిలో కాసేపు సరదాగా గడిపారు. పవన్ రాకను గమనించిన అభిమానులు భారీగా అక్కడికి వచ్చారు. ఆయన్ను కలిసేందుకు ఎగబడ్డారు… కొంతమంది అయితే కాన్వాయ్‌ను వెంబడించారు. శనివారం నాడు పవన్ హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండకు చేరుకొని… ఆదివారం వెంకన్నను దర్శించుకున్నారు. అనంతరం కొద్దిసేపు పార్టీ నేతలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇవాళ జాపాలి ఆలయానికి వెళ్లారు. జనసేనాని  మంగళవారం కూడా తిరుమలలోనే ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Tags:Pawan tour in Thirumala

నా డ్యూటీ నేను చేశానంతే..జగన్ కేసులపై జేడిలక్ష్మీనారాయణ 

Date:14/05/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రస్తుత వైకాపా అధినేత, అప్పటి కాంగ్రెస్ ఎంపీ వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసును విచారించిన నాటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు జగన్ కేసులను విచారించిన అధికారిగా పేరు వచ్చినప్పటికీ, తాను ఆ ఇమేజ్ ని కోరుకోవడం లేదని చెప్పారు. నాడు తనకు అప్పగించిన డ్యూటీని తాను చేశానని, ఆనాడు తనపై ఏ విధమైన రాజకీయ ఒత్తిడులూ లేవని స్పష్టం చేశారు. ఆ కేసును తనకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, హైకోర్టు బెంచ్ నిర్ణయించి విచారించాలని అప్పగించిందని, ఎవరూ డైరెక్టుగా ఇచ్చిన కంప్లయింట్ కాదని గుర్తు చేశారు.కేసులో అందుబాటులోని సాక్ష్యాధారాల ప్రకారం తాను డ్యూటీ చేశానని, తాను ఎంతో మంది అధికారులను పర్యవేక్షించే బాధ్యతలను చేపట్టానని, క్షేత్రస్థాయిలో ఎంతోమంది అధికారులు జగన్ కేసులపై దర్యాఫ్తు చేశారని లక్ష్మీనారాయణ వెల్లడించారు. తాను ఆ పదవి నుంచి బయటకు వచ్చిన తరువాత, ఎంతో మంది అధికారులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారని, దీంతో జగన్ కేసు బలహీనపడి, వీగిపోతుందని పలువురు భావిస్తున్నారన్న వార్తలపై స్పందిస్తూ, ఆ విషయంలో తానేమీ వ్యాఖ్యానించలేనని, ఇప్పుడున్న అధికారులు కూడా సమర్థవంతంగా పనిచేస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారనే అనుకుంటున్నానని తెలిపారు. తాను పనిచేసినంత కాలం ఏ ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి రాలేదని స్పష్టం చేశారు.
Tags:My Duty I’m Jadilakshinarayana on Jagan Cases

ట్విట్టర్లో 91 శాతం తప్పుడు వార్తలేనట!

Date:14/05/2018
వాషింగ్టన్  ముచ్చట్లు:
ట్విట్టర్ సామాజిక మాధ్యమం గాలి వార్తలకు వేదికగా నిలుస్తోంది. ఇందుకు నిదర్శనంగా ట్విట్టర్ యూజర్లు వ్యాప్తి చేసే వార్తల్లో 86-91 శాతం తప్పుడువేనని అమెరికాలో ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో చాలా మంది యూజర్లు ఫేక్ వార్తలను రీట్వీట్ చేస్తూ లేదా లైక్ కొడుతున్నారట. ఈ అధ్యయనం వివరాలు జర్నల్ నేచురల్ హజార్డ్ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి.
కేవలం ఐదు నుంచి తొమ్మిది శాతం మంది యూజర్లు మాత్రమే తప్పుడు వార్తా? కాదా? అని వచ్చిన వార్తను రీట్వీట్ చేసి నిర్ధారించుకుంటున్నట్టు అధ్యయనకారులు గుర్తించారు. కేవలం 1-9 శాతం లోపు వారు వార్తల కచ్చితత్వంపై సందేహం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. ఇక తప్పుడు వార్తలను వ్యాప్తి చేసిన వారిలో పది శాతం మంది వరకు తర్వాత వాటిని డిలీట్ చేస్తున్నారట.
Tags:91 percent of Twitter is false news!

కర్ణాటక అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్!

Date:14/05/2018
బెంగళూర్  ముచ్చట్లు:
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఏ పార్టీ అధికారిలోకి వస్తుందనే విషయమై జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నట్టు సమాచారం. ఒకవైపు కర్ణాటక ఎన్నికల్లో హంగ్‌ తప్పదని ఎగ్జిట్‌ పోళ్లన్నీ చెబుతుంటే బెట్టింగ్ కు రాయుళ్లు తమ వాహనాలు, భూములు, నగదు, ఆస్తులను పణంగా పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో తుముకూరు, మంగళూరు, బెంగళూరు, మాండ్యా, రామ్ నగర్ జిల్లా కేంద్రంగా ఈ దందా సాగుతోంది. ముఖ్యంగా కీలక అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడనే విషయమై జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నట్టు తెలుస్తోంది. బెంగళూరు సిటీతో పాటు బదామి, చాముండేశ్వర, బాగేపల్లి, పావగడ, మధుగిరి, చామరాజ్ నగర్ నియోజకవర్గాలపై అందరి దృష్టి ఉంది. గత రాత్రి నుంచే బెట్టింగ్ వ్యవహారం ఊపందుకుంది. బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకునే నిమిత్తం ప్రత్యేక పోలీస్ బృందాలు నిఘా ఏర్పాటు చేసినట్టు సమాచారం. కేవలం కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. కాగా, బదామి నుంచి సీఎం సిద్ధరామయ్య, బీజేపీ నేత శ్రీరాములు, జేడీఎస్ నేత హనుమప్ప పోటీ చేశారు. ఈ ముగ్గురిలో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై జోరుగా బెట్టింగ్ జరుగుతోందట. అదేవిధంగా, చాముండేశ్వరి నియోజకవర్గంలో సిద్ధరామయ్య ఓడిపోతారనే వదంతుల నేపథ్యంలో అక్కడ కూడా జోరుగా బెట్టింగ్ కు పాల్పడుతున్నారు. బళ్లారి అర్బన్, రూరల్ లో కూడా బెట్టింగ్ బాగా జరుగుతోందని పోలీసుల సమాచారం.
కర్ణాటకలో హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో జేడీఎస్ అభ్యర్థులపై అత్యధికంగా బెట్టింగ్ జరుగుతోంది. ముఖ్యంగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకని బెట్టింగ్ రాయుళ్లు తమ పందేలు కాస్తున్నట్టు సమాచారం. స్థానికంగా సదరు నేత ఏ పార్టీకి చెందిన వాడు, ఆ నేతకు ఉన్న ప్రజాదరణ, పోలింగ్ బూత్ స్థాయిలో జరిగిన ఓటింగ్ శాతాన్ని ఆధారంగా చేసుకుని బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారు.
Tags:BORGERY BORGING ON Karnataka Assembly Results!

 రోషిని కేర్ అఫ్ తూర్పు గది  ఆడియో విడుదల 

Date:14/05/2018
  సినిమా ముచట్లు:
శ్రీవారి క్రియేషన్స్ పతాకం పై మున్నా, ప్రియాంక ఆగస్టీన్ హీరో హీరోయిన్లు గా ఎస్. శ్రీనివాస్ మరియు ఎస్. సుధీర్ సంయుక్త నిర్మాణం లో శరగడం శ్రీనివాస్ దర్శకత్వం లో జి వి కె సమర్పణలో రూపుదిద్దుకుంటున్న చిత్రం  రోషిని కేర్ అఫ్ తూర్పు గది. ఇటీవలే ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సి. కళ్యాణ్  ఆడియో సి డి ని విడుదల చేసి మొదటి సి డి ని తెలుగు ఫిలిం చాంబర్ కార్యదర్శి ముత్యాల రాందాసుకు అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ “ఈ మధ్యకాలంలో కథ బలం వున్న సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వాళ్ళకి చిన్న పెద్ద తేడా లేదు, అందుకే మంచి కథలతో సినిమాలు తీస్తే తప్పక విజయం సాధిస్తాయి. ఇండస్ట్రీ లో ఎంప్లాయిమెంట్ ఎక్కువగా చిన్న సినిమాల వల్లనే జరుగుతుంది. వాటి సర్వైవల్ కోసం ప్రభుత్వం 5వ షో  ఇస్తుంది, దానివల్ల చిన్న సినిమాలకు మంచి జరుగుతుంది. చిన్న సినిమాలకు మీడియా వాళ్ళు సహకరించాలి  ” అని అన్నారు.
చాంబర్ సెక్రటరీ ముత్యాల రాందాసు మాట్లాడుతూ “చిత్ర సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ చక్కటి సంగీతం అందించారు, ఖచ్చితంగా పాటలు అందరికి నచ్చుతాయి. చిన్న సినిమాలకి చాంబర్ సహాయం ఎప్పుడు ఉంటుంది” అని అన్నారు.  చిత్ర దర్శకుడు, నిర్మాతలలో ఒక్కరైనా శరగడం శ్రీనివాస్ మాట్లాడుతూ “ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీ ని నమ్ముకుని ఉన్నాను. ఎంతో కష్టపడి ఈ సినిమా తీసాను.  చిత్ర నిర్మాణం లో ప్రతీ టెక్నీషియన్  హీరో హీరోయిన్ మాకు బాగా సహకరించారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి మోహన్ గౌడ్  తన భుజాలమీద వేసుకుని జరిపించారు. అందరికి నా ధన్యవాదాలు” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో చాంబర్ కోశాధికారి టీ రామ సత్యనారాయణ, నిర్మాత సాయి వెంకట్, జె వీ మోహన్ గౌడ్, జి వి కె తదితరులు పాల్గున్నారు.
Tags:Roshini Care of East Room Audio Release

స్టార్ మా తెలుగు ప్రేక్షకుల కోసం త్వరలో బిగ్ బాస్ సెక్షన్-2 

Date:14/05/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
స్టార్ మా తెలుగు ప్రేక్షకుల కోసం బిగ్ బాస్ సెక్షన్ -2 ను త్వరలో ప్రసారం చేయాలని స్టార్ మా నిర్నయించింది.ప్రేక్షకులకు వినోదాత్త్మకమైన కార్యక్రమాలను తెలుగు లో మొట్ట మొదటి సారిగా ప్రసారం చేస్తున్నామని,యువతకు ,పిల్లలకు వినోదాత్మకమైన కార్యక్రమాలకోసం టికెట్ ప్రవేశ పెడుతున్నామని స్టార్ మా ఒక ప్రకటనలో తెలిపింది.బిగ్ బాస్ కుటుంబం లో సబ్యులుగా చేరి వారి వారి ఆడియో,విడియో లను తమ సంస్థ వెబ్ సైట్ www.biggbosstelugu.startv.com, లో లోడ్ చేసుకోవచ్చునని,ఇలా షేర్ చేసుకున్న వారి  మంచి ఆడియో,విడియో లను ఎంపిక చేసి నగదు భాహుమతి అందజేస్తామని  తెలిపారు.
Tags:Stylized bass section for star our Telugu audience

ఇక షెల్ కంపెనీలకు చిక్కులే

Date:14/05/2018
ముంబై ముచ్చట్లు:
ఆర్థిక నేరాలకు పాల్పడుతూ, నిధులను మళ్లించే డొల్ల (షెల్) కంపెనీలకు చెక్ పెట్టాలని కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అనేక కంపెనీలు కాగితాలకే పరిమితమైన కంపెనీలను ఏర్పాటు చేసి నిధులను మళ్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డొల్ల కంపెనీలకు స్పష్టమైన నిర్వచనం ఇచ్చే విధంగా చట్టాన్ని రూపొందించాలని కేంద్రం భావిస్తోంది. దీని వల్ల న్యాయస్థానాల్లో దర్యాప్తు ఏజన్సీలు కూడా డొల్ల కంపెనీల వ్యవహారాలను నిలదీసి శిక్షపడేటట్లు చేసేందుకు వీలవుతుంది. దేశంలో నిధులను మళ్లించేందుకు అనేక కంపెనీలు డొల్ల కంపెనీలను విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తారు. కానీ ఈ డొల్ల కంపెనీలకు చట్టంలో ఇంతవరకు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం వల్ల దర్యాప్తు ఏజన్సీలు అనేక ఇక్కట్లను ఎదుర్కొంటున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబి, ఆదాయం పన్ను శాఖలు డొల్ల కంపెనీల తీరుపై నివేదికలను కార్పోరేట్ మంత్రిత్వశాఖకు ఇచ్చాయి. డొల్ల కంపెనీలకు ఇచ్చే నిర్వచనంపైన కూడా తమ అభిప్రాయాలను న్యాయ కోవిదుల ద్వారా రూపొందించి ఇచ్చాయి. ఈ అంశాలపై ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎఫ్‌ఎస్‌డిసి)లో కూడా చర్చ జరిగింది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ అనే సంస్థ కూడా రెగ్యులేటరీ మార్గ‌సూచీని రూపొందించింది. షెల్ కంపెనీని రిజిస్టర్ చేసి, న్యాయబద్ధంగా సంస్థ ఆదాయంలో చూపెడుంటారు. కాని ఈ సంస్థ ఎటువంటి ఆపరేషన్స్‌ను నిర్వహించదు. కాని ఈ సంస్థ ద్వారా నిధులు ప్రవహిస్తాయి. సెబి మాత్రం కంపెనీలో భాగంగా ఉండి, ఎటువంటి పాత్ర నిర్వహించకుండా, నిధుల ప్రవాహానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. షెల్ కంపెనీలకు ఆర్థిక, వాణిజ్య, న్యాయ శాస్త్రం, చట్టపరంగా పటిష్టమైన నిర్వచనం ఇవ్వాలని, దీని వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కొల్లగొట్టడం, అక్రమమార్గాల ద్వారా మళ్లించే వారి భరతం పట్టేందుకు దర్యాప్తు ఏజన్సీలకు ఆయుధనం ఇచ్చినట్లవుతుందని కేంద్రం భావిస్తోంది. సెబి గత ఏడాది 331 డొల్ల కంపెనీలపై కొరఢా ఝుళిపించింది.
Tags”Shell companies are in trouble