భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

Date:15/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపానికి గురై భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం జరిగింది. పట్టణంలోని మార్కెట్‌యార్డు వద్ద గల శాంతినగర్‌లో రెడ్డిమహేష్‌(35) , రెడ్డి లీలావతి నివాసం ఉన్నారు. వీరికి ఒక కుమారై ఉంది. ఇలా ఉండగా కుటుంబ కలహాలతో రెడ్డిలీలావతి భర్తను వదిలి పుట్టినింటికి వెళ్లింది. పలుమార్లు పంచాయతీలు నిర్వహించినా భర్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపానికి గురైన భర్త రెడ్డిమహేష్‌ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిని గమనించిన తల్లి మునిరత్నమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

టెంపో ఢీకొని మోటాసైకిలిస్ట్ మృతి

Tags: The husband commits suicide as the wife does not come to the camp

టెంపో ఢీకొని మోటాసైకిలిస్ట్ మృతి

Date:15/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

బోయకొండ దర్శనానికి స్నేహితునితో కలసి ద్విచక్రవాహనంలో వెళ్లి తిరిగి వస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న టెంపో ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరోకరు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం మేరకు పెద్దపంజాణి మండలం ముతుకూరుకు చెందిన కుమార్‌ (26) , శివరాజు కలసి ద్విచక్రవాహనంలో బోయకొండకు వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని తిరిగి వస్తు మార్గమధ్యంలో చదళ్ల వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టెంపో అతివేగ ంగా మోటారుసైకిలిస్ట్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమార్‌ , శివరాజు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుమార్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

బస్సును ఢీకొన్న లారీ

Tags: Tempo collide and the motorcyclist dies

బస్సును ఢీకొన్న లారీ

– మహిళకు తీవ్ర గాయాలు

Date:15/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఆర్టీసి బస్సును లారీ వెనుక వైపున ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గాంధినగర్‌కు చెందిన మెహర్‌తాజ్‌ మదనపల్లెకువెళ్లి తిరిగి శనివారం రాత్రి పుంగనూరుకు ఆర్టీసి బస్సులో వస్తుండగా వెనుకవైపు నుంచి వస్తున్న బస్సు సుగాలిమిట్ట వద్ద ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న మెహర్‌తాజ్‌కు కుడిచెయ్యి విరిగిపోయి తీవ్ర రక్తగాయాలైంది. బాధితురాలిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. చికిత్సలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఆటోబోల్తా 7 మందికి గాయాలు

Tags: The lorry that collided with the bus

ఆటోబోల్తా 7 మందికి గాయాలు

– ముగ్గరి పరిస్థితి విషమం

Date:15/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

అతివేగంగా వస్తున్న ఆటో బోల్తాపడటంతో 7 మందికి గాయాలు కాగా అందులో ముగ్గరి పరిస్థితి విషమంగా మారిన సంఘటన ఆదివారం జరిగింది. పుంగనూరు మండలం కొండచెర్ల కురప్పల్లె సమీపంలోని మలుపు వద్ద అతివేగంగా ఆటోను డ్రైవర్‌ నడుపుతూ బోల్తా కొట్టించాడు. ఆరడిగుంట నుంచి కురప్పల్లె మీదుగా పుంగనూరుకు వస్తున్న ప్రయాణికులు నాగరత్న(35) , రాజమ్మ(40), గురుదేవమ్మ(52), మమత(20), నాగరాజమ్మ(40), సీతమ్మ(50), గౌరమ్మ(40) కలసి వస్తుండగా ఆటో కొండచెర్ల కుపరప్పల్లె వద్ద అతివేగంగా వస్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అందరు గాయపడ్డారు. వీరిని పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో నాగరాజమ్మ, సీతమ్మ, గౌరమ్మల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు తరలించారు. డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎంపి చొరవతో విద్యార్థికి సెంట్రల్‌ యూనివర్శిటిలో స్థానం

Tags: Autoboltha injuries to 7 people

ఎంపి చొరవతో విద్యార్థికి సెంట్రల్‌ యూనివర్శిటిలో స్థానం

Date:15/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గం సదుం మండల కేంద్రానికి చెందిన షేక్‌ జబివుల్లాకు ఢిల్లీ సెంట్రల్‌ యూనివర్శిటిలో సీటు లభించింది. పేద విద్యార్థికి సీటు ఇవ్వాలని ఎంపి మిధున్‌రెడ్డి యూనివర్శిటి వైస్‌ చాన్స్లర్‌ను కోరారు. దీనిపై వైస్‌ చాన్స్లర్‌ సానుకూలంగా స్పందిస్తూ ఎంపి కోరిక మేరకు షేక్‌ జబివుల్లాకు ఆర్కిటెక్చర్‌ కోర్సులో అడ్మిషన్‌ కల్పించారు. ఈ విషయాన్ని బిజెపి రాష్ట్ర మోర్చ కార్యదర్శి అయూబ్‌ఖాన్‌ ఎంపి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై విద్యార్థితో పాటు అయూబ్‌ఖాన్‌ కలసి ఎంపి మ్యిధున్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

హోమియో  వైద్యశిబిరం

Tags: Position at Central University for student with MP initiative

హోమియో  వైద్యశిబిరం

Date:15/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం సుగాలిమిట్టలో హోమియో  వైద్యశిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. తాండా డెవలెప్‌మెంట్‌ వారి ఆధ్వర్యంలో తాండాలోని గిరిజనులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా, టైపాయిడ్‌ జ్వారాలను నివారించేందుకు ముందుజాగ్రత్తగా హ్గమియో మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ నాగేనాయక్‌, తులసినాయక్‌, జగదీష్‌నాయక్‌, సిబ్బంది పాల్గొన్నారు.

గర్భవతులు పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలి

Tags: Homeopathy

గర్భవతులు పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలి

Date:15/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

గర్భవతులు అందరు క్రమం తప్పకుండ పాలు, గ్రుడ్డులాంటి పౌష్ఠికాహారాన్ని ప్రతి రోజు తీసుకోవాలని మండల మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సోనియా పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలో ఆయుష్‌మాన్‌భారత్‌ పథకం క్రింద ర్యాలీని 104 వైద్యాధికారి డాక్టర్‌ ప్రవీన్‌, డాక్టర్‌ ఆనందరావుతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. సెప్టెంబర్‌ 15 నుంచి అక్టోబర్‌ 2 వరకు మున్సిపాలిటి, మండల సబ్‌సెంటర్లలో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకోవాలన్నారు. గర్భవతులు పౌష్ఠికాహారంతో పాటు సరైన వైద్యచికిత్సలు చేసుకోవాలని సూచించారు. గర్భవతులు నిర్లక్ష్యం చేస్తే బిడ్డలు ఆనారోగ్యానికి గురైయ్యే అవకాశం ఉందని తెలిపారు. గర్భవతులు ప్రతి నెల తమ ఆరోగ్య పరిరక్షణ వివరాలను నమోదు చేయించుకుని వైద్య సేవలు పొందాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా గర్భవతులకు చికిత్సలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ హరిప్రసాద్‌, సోమలి, విజయలక్ష్మి, పార్వతమ్మతో పాటు ఏఎన్‌ఎంలు ,ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

రైల్వేబోర్డు మెంబర్‌గా ఎంపి రెడ్డెప్ప

Tags; Pregnant women should take nutritional supplements

రైల్వేబోర్డు మెంబర్‌గా ఎంపి రెడ్డెప్ప

Date:14/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు పార్లమెంట్‌ సభ్యులు ఎన్‌.రెడ్డెప్పను కేంద్ర ప్రభుత్వం రైల్వేబోర్డు మెంబరుగా నియమించింది. శనివారం ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ రైల్వేబోర్డు మెంబరుగా నియమించేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి, రాజంపేట ఎంపి మిధున్‌రెడ్డికి, రాష్ట్రపంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో సభ్యుడుగా కొనసాగనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రైల్వేలైన్లు ,స్టేషన్ల అభివృద్ధికి శక్తి వంచన లేకుండ కృషి చేస్తానని తెలిపారు. కాగా తొలిసారిగా పార్లమెంట్‌ సభ్యులుగా ఎంపికైన రెడ్డెప్ప దళితకుటుంబంలో జన్మించారు. సీనియర్‌ న్యాయవాదిగా కొనసాగుతూ వైఎస్సార్సీపిలో ఎంపిగా గెలుపొందారు. పార్లమెంట్‌లో వివిధ రకాల సమస్యలపై తొలి సమావేశాలలోనే తన సత్తాచాటుకుని ఆదర్శంగా నిలిచారు. రైల్వేబోర్డు మెంబరుగా నియమితులైన వెంటనే మంత్రి పెద్దిరెడ్డిని కలసి ఆయన ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పలువురు ఎంపి రెడ్డెప్పకు శుభాకాంక్షలు తెలిపారు.

15న మదనపల్లెలో ఆటోడ్రైవర్ల సమావేశం

Tags: MP Reddeppa as Railway Board Member