రాళ్ల పాడు ప్రాజెక్టుకు అన్నీ అడ్డంకులే

Date:26/04/2018
ఒంగోలు ముచ్చట్లు :
రాళ్లపాడు ప్రాజెక్టు పట్ల్ల సర్కారు నిర్లక్ష్య వైఖరిపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ ఆందోళన తీవ్రం చేశారు. రాళ్లపాడుకు నీరందించే సోమశిల ఉత్తరకాల్వ నిర్మాణం, ప్రాజెక్టు ఎడమకాల్వ పొడగింపు పనులు  పూర్తి చేయాలని, రాళ్లపాడు నుంచి నీళ్లు తరలించే జీఓ నంబర్‌ 40 రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరందించే సోమశిల ఉత్తర కాల్వ నిర్మాణ పనులు పూర్తి కాలేదు. చింతలదీవి అనే గ్రామం వద్ద భూసేకరణ సమస్యను పరిష్కరించకపోవడంతో ఒక అడుగు ముందుకు..మూడడుగుల వెనక్కి అన్నట్టు  సాగుతోంది. ప్రాజెక్టు ఎడమ కాల్వ పొడగింపు పనులు మూడేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదని, భూసేకరణ గ్రామాల్లో సోషల్‌ ఇంపాక్టు సర్వే పూర్తి  కాలేదు. ఈ కారణంతో పనులు ఆగాయంటే ప్రభుత్వ పనితీరు ఏవిధంగా ఉందో, కందుకూరు నియోజకవర్గం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.  ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా  రైతులు గ్రామాలు వదిలి ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. రాళ్లపాడు రైతులను ఆదుకోకపోతే గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. మరోపక్క రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి కామథేనువు ప్రాజెక్టు నుంచి నీటిని తరలించేందుకు ప్రభుత్వం జీవో నంబర్‌ 40ని విడుదల చేయడంపై జనాలు మండిపడుతున్నారు. ప్రాజెక్టులో నీరు లేక నాలుగేళ్లుగా  కరువుకాటకాలతో అల్లాడుతుంటే ప్రాజెక్టు నుంచి నీటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కామథేను పశు అభివృద్ధి కేంద్రం భూముల్లోంచే సోమశిల కాల్వ వస్తున్నా అక్కడి నుంచి నీటిని మళ్లించకుండా, రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి వెనక్కి 12కిలోమీటర్లు నీటిని తరలించడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏంటని నిలదీశారు. ఇది పూర్తిగా రాళ్లపాడు ప్రాజెక్టును నిర్వీర్యం చేసు కుట్రను ప్రభుత్వం చేస్తుందని, దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
Tags:Everything is a barrier to the rock project

 భారంగా  బత్తాయి

Date:26/04/2018
ఒంగోలు ముచ్చట్లు :
జిల్లాలో ఒకప్పుడు సిరులు కురిపించిన బత్తాయి, నిమ్మ తోటలు ఆదరణ కోల్పోతున్నాయి. రైతులు ఈ పండ్ల తోటల పట్ల ఆసక్తి చూపడం మానేస్తున్నారు. వేసవి కాలంతో పాటు వర్షాకాలంలో కూడా పండ్ల తోటలను కాపాడుకోవడానికి ఏటా రైతులు భగీరథ ప్రయత్నం చేయాల్సి వస్తోంది. పండ్లతోటలు ఎక్కువ విస్తీర్ణంలో ఎండిపోయాయి. ప్రకాశం జిల్లాలోని పరిస్థితిని గమనించిన జిల్లా ఉద్యానశాఖ అధికారులు విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పండ్లతోటలపై సమీక్షించారుగత యేడాది కరువు విలయతాండవం చేయడంతో వందల ఎకరాల్లో పండ్లతోటలను రైతులు వదిలేశారు. కొన్ని ప్రాంతాలలో అష్టకష్టాలు పడి తోటలను కాపాడుకున్నారు. ఈ పరిస్థితిలలో పంట దిగుబడి మార్కెట్లో రాగానే నిమ్మ ధరలు పతనమయ్యాయి.సాధారణంగా ఎకరాకు 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ప్రతికూల వాతావరణం వల్ల సగానికి దిగుబడి పడిపోయింది. అయినా.. కనిగిరి మార్కెట్‌ నుంచి ఆయా సీజన్‌లలో రోజుకి 70 నుంచి 85 టన్నుల వరకు కాయలు ఎగుమతి అయ్యేవి. అలాంటి పరిస్థితి నుంచి రానురాను నిమ్మ రైతులు నష్టాలతో పాటు కష్టాలను ఎదుర్కొనే దుస్థితి వచ్చింది.నాలుగేళ్ళుగా జిల్లాలో వర్షాలు లేకపోవడం.. వాతావరణ పరిస్థితులు సక్రమంగా ఉండకపోవడం.. పంట కోతల సమయంలో మార్కెట్లో ధరలు పతనమవడం.. వంటి కారణాలు రైతులను వెం టాడుతున్నాయి. దీనికి తోడు భూగర్భజలాలు అడుగంటి.. బోర్లలో నీళ్ళు రాకపోవడం కూడా ప్రధాన కారణంగా రైతులు ఈ పండ్ల తోటలను వదిలేయాల్సిన పరిస్థితి వస్తోంది.పదేళ్ళ క్రితం కనిగిరి ప్రాంతంలో విస్తారంగా కనిపి ంచే బత్తాయి, నిమ్మ తోటలు ఆదరణ కోల్పోతున్నాయి. రానురాను తోటల కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో బత్తాయి, నిమ్మ తోటలు 2,782 హెక్టార్లకు పైగా సాగవుతాయి.  పదేళ్లకు ముందు ఈ పండ్ల తోటలు విస్తీర్ణం పెరిగేది. ఎక్కువగా ఈ తోటలు మార్కాపురం, కనిగిరి ప్రాంతంలో విస్తారంగా కనిపించేవి. కొనకనమిట్ల మండలంలోని చినారికట్లలో ప్రధాన సాగు నిమ్మతోటలే.1200 ఎకరాలలో రైతులు సాగు చేస్తారు. ముఖ్యంగా నిమ్మతోటలకు కనిగిరి ప్రసిద్ధి. ఎకరాకు ఎరువులు, పురుగుమందులు, ఇతర ఖర్చులతో కలిపి మొత్తం రూ.50 వేల నుంచి రూ.75 వేల  వరకు పెట్టుబడి అయ్యేది. అలాంటిది గత నాలుగేళ్లుగా జిల్లాను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి.ఈ ఏడాది నుంచి బత్తాయి, నిమ్మ తోటల సాగును ప్రోత్సాహించవద్దని ఆదేశించారు. ఆ పండ్ల తోటలకు ఇచ్చే 50 శాతం రాయితీని నిలిపివేయాలని సూచించారు. వాటి స్థానంలో విషయాన్ని యాపిల్‌బెర్, దానిమ్మ, నేరెడు, జామ తోటలను ప్రోత్సాహించాలని ఆదేశించారు. వీటికి రాయితీలను ప్రోత్సాహించి ఉద్యాన రైతులను అటువైపు మళ్లించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. దీంతో  పాటు ప్రతి ఐదెకరాలకి ఒక ఫాంపాండ్‌ ను ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు రాయితీ ఇవ్వాలని ఉద్యాన అధికారులకు తెలిపారు.ఉద్యాన పంటలకు కూడా 100 శాతం డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు జిల్లాను వెంటాడుతున్న ప్రతికూల వాతావరణం కూడా తోడవడంతో రానున్న కాలంలో జిల్లాలో బత్తాయి, నిమ్మ తోటల సాగుకు రైతులు దూరమయ్యే అవకాశం ఉంది. తోటలు కూడా దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి రాబోతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు వీటిపై ఆధారపడిన వ్యవసాయ కూలీలు ఇతర మార్గాలను ఎంచుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలవైపు వెళుతున్నారు.
Tags:Heavy burden

వామ్మో ఎండలు…

Date:26/04/2018
కర్నూలు ముచ్చట్లు :
ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నేల నుంచి ఎగిసే సెగ, పైనుంచి కాల్చేసే ఎండ వేడిమితో ప్రాణాలు అతలాకుతలమైపోతున్నాయి. అంతకంతకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తీవ్రమైన వడగాడ్పులతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ఉడికిపోయాయి.. ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ వడగాడ్పులు వీస్తున్నాయి గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు వాటికి ఆనుకున్న ఉన్న నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వడగాడ్పులు ప్రభావం కొనసాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ భానుడి తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు రావడానికి వెనుకంజ వేస్తున్నారు, తెలంగాణ, రాయలసీమలో కూడా ఎండ తీవ్రత కొనసాగింది. వాయవ్య భారతం పరిసరాల్లో వడగాడ్పులు కొనసాగుతున్నందున ఆ ప్రభావం తెలుగు రాష్ర్టాల వరకూ విస్తరించిందిఇప్పటికే ఉభయ రాష్ట్రా‌ల్లో ఎండదెబ్బకు కొన్ని పదుల మంది ప్రాణాలు కోల్పోయారంటే ఇక మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటానికే భయమేస్తోంది.వడగాల్పుల వల్ల నగరవాసులు అనారోగ్యానికి గురవుతున్నారు. అన్ని వయస్సుల వారు భానుడి ప్రతాపానికి అల్లాడుతున్నారు. ఎండలు క్రమంగా పెరుగుతుండడంతో  నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం అయ్యిందంటే బయటకు రావడానికే భయపడుతున్నారు. ఎక్కడ కాసింత నీడ దొరికినా సేద తీరుతున్నారు. చల్లని పానీయాలను  సేవిస్తున్నారు. వేడి తగలకుండా గొడుగులను, కర్చీఫ్‌లను  రక్షణగా వాడుకుంటున్నారు. ఈ ఏడాది ఎండలు దారుణంగా ఉన్నాయని.. తట్టుకోలేకపోతున్నామని  నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నగరంలో మండే ఎండలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడగాల్పుల వల్ల నగరవాసులు అనారోగ్యానికి గురవుతున్నారు. అన్ని వయస్సుల వారు భానుడి ప్రతాపానికి అల్లాడుతున్నారు. ఎండలు క్రమంగా పెరుగుతుండడంతో  నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం అయ్యిందంటే బయటకు రావడానికే భయపడుతున్నారు. ఎక్కడ కాసింత నీడ దొరికినా సేద తీరుతున్నారు. చల్లని పానీయాలను  సేవిస్తున్నారు. వేడి తగలకుండా గొడుగులను, కర్చీఫ్‌లను  రక్షణగా వాడుకుంటున్నారు. ఈ ఏడాది ఎండలు దారుణంగా ఉన్నాయని.. తట్టుకోలేకపోతున్నామని  నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోహిణి కార్తె రాకముందే ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఎండ తీవ్రతకు తట్టుకోలేక ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. రోహిణి కార్తెలో రోళ్ళు పగులుతాయన్నది నానుడి. రోహిణి కార్తె రాకముందే దేశంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. సాధారణ ఉష్ణోగ్రత కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల వేడి నమోదైంది. రాయలసీమ, కోస్తాంధ్రలో సాధారణంకన్నా రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి .సూర్య కిరణాల్లో అతినీలలోహిత కిరణాల ప్రభావం అధికంగా ఉండటంతో.. ఎండలో తిరిగే వారు అనారోగ్యానికి గురవుతున్నారు.
TAgs:Wammy sunny ….

చిత్తూరులో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసిన జేసీ గిరీశా..

Date:26/04/2018

JC Giri, who released the MLM election notification in Chittoor
JC Giri, who released the MLM election notification in Chittoor

Tags:JC Giri, who released the MLM election notification in Chittoor

తిరుమలలో మాజీ ముఖ్యమంత్రి షిండే

Date;26/04/2018

తిరుమల ముచ్చట్లు :

రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ త్వరలో దేశాని పరిపాలిస్తుందని మాజీ కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండ్ ఆశాభావం వ్యక్తం చేసారు…శ్రీవారి దర్శనార్థం కుటుంబంతో కలసి తిరుమలకు వచ్చిన ఆయన, ఉదయం ఆలయంలోకి వెళ్లి సుప్రభాతం, తోమాల, అర్చన సేవల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు..అనంతరం హుండీలో ‌కానుకలు సమర్పించి మ్రొక్కులు చెల్లించిన షిండేకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసారు..‌…కర్ణాటక ఆసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని షిండే మీడియా ముందు ధీమా వ్యక్తం చేసారు..‌.నాడు యూపిఏ హాయంలో ఆంధ్రప్రదేశ్ ను విభజించినప్పుడు ఏపికి స్పెషల్ కేటాగిరీ స్టేటస్ ఇవ్వాలని చట్టం చేయడం జరిగిందని, అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏన్డీయే పార్లమెంటు చట్టాలను కూడా చేయకుండా పరిపాలన చేస్తుండడం గమనార్హమన్నారు…హోదా కోసం ముఖ్యమంత్రి స్థాయి నుండి అన్ని రాజకీయ పార్టీలు పోరాడుతుండడాని షిండే అభినందించారు.

Tags:Former chief minister Shinde in Tirumala

 

నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు

Date:26/04/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
హైద్రాబాద్ నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపడుతున్నారు. సమ్మర్ కోసం అవసరమైతే ఎమర్జెన్సీ పంపింగ్ అవసరమని అంచనాతో అందుకు అనుగుణంగా అధి కారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నిత్యం 900 క్యూసెక్కుల నీటిని తరలించే 10 ఎమర్జెన్సీ పంపింగ్ మోటార్లు సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.3.7 కోట్ల మేర ఖర్చుతో అత్యవసర పంపింగ్‌నకు ట్రాన్స్‌మిషన్ విభా గం అన్నీ ఏర్పాట్లు చేసింది. ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకుంటూ కృష్ణా జలాల తరలింపు ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టి ప్రజలకు వేసవిలో నీటి కష్టాలు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటుండడం గమనార్హం. నీటి నిల్వలు ప్రమాదకరస్థాయికి చేరినా అత్యవసర పంపింగ్ ద్వారా రోజూ 270 ఎంజీడీల (మిలియన్ గ్యాలన్ ఫర్ డే) నీటిని తరలిం చేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.
నాగార్జున సాగర్‌లో శరవేగంగా నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో  అధికారుల చూపులన్నీ ఒక్కసారిగా సాగర్ వైపు మళ్లాయి. ఎమర్జెన్సీ పంపింగ్ ప్రక్రియను పరిశీలిస్తే నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ నుంచి పుట్టంగండి ఛానల్ ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ జలాశయంలోకి పంపింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్ నుంచి నీటిని సేకరించి కోదండపూర్ రిజర్వాయర్‌కు తరలిస్తారు. అక్కడి శుద్ధి చేసిన ఈ నీటిని మూడు దశల్లో నగరానికి రోజూ 270 ఎంజీడీలను తరలించనున్నారు. ఈ క్రమంలోనే అత్యవసర పంపింగ్ ద్వారా పుట్టంగండిని నీటిని తరలించి, అక్కడి నుంచి కోదండపూర్, ఇక్కడ శుద్ధి చేసిన నీటిని నగరానికి తరలించే విధానంలో ఎలాంటి ఇబ్బందులు ల్లేకుండా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. సాగర్ నీటి నిల్వలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ 900 క్యూసెక్కుల సామర్థ్యంతో 10 ఎమర్జెన్సీ పంపింగ్ మోటార్ల ద్వారా నిత్యం 270 ఎంజీడీల నీటిని తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కృష్ణా జలాల తరలింపులో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని అధికారులు స్పష్టం చేశారు. గరిష్ట స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 513 అడుగులకు నీటి నిల్వలకు చేరాయి. ఐతే వాస్తవంగా 506 అడుగులు చేరిన వెంటనే అత్యవసర పంపింగ్ ద్వారా నీటి తరలింపు ప్రక్రియను చేపడతారు.
Tags:Plans for the prevention of water shortages

బ్యాంకుల్లో ఆధార్ సేవలు

Date:26/04/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
ప్రతి పనికి .ఆధార్ నెంబర్ కీలకంగా మారుతున్న సందర్భంలో. బ్యాంకుల్లో తాజాగా ఏర్పాటు చేసిన ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లలో ఆధార్‌కు సంబంధించిన సేవలన్నీ అందుబాటులో ఉంచారు. అడ్రస్‌ఫ్రూఫ్, ఐడీఫ్రూఫ్ తీసుకొని వస్తే ఆధార్‌కార్డ్ ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవచ్చు. బ్యాంకుల్లో ఖాతాలున్నా లేకపోయినా ఏ వ్యక్తి అయినా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉన్న బ్యాంకు బ్రాంచ్‌ని సంప్రదించి ఆధార్ నమోదు చేసుకోవచ్చు. కొత్తగా ఆధార్ నమోదు చేసుకోవడం, పేర్లు, చిరునామా, పుట్టినతేదీ, ఫొటోల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడం, ప్రతి ఆధార్‌నెంబర్‌కు ఫోన్‌నెంబర్, ఈ మెయిల్ అడ్రస్‌ను అనుసంధానం చేసుకోవడం, వయస్సు పైబడి, లేక వివిధ కారణాల వల్ల ఆధార్‌లోని వేలి ముద్రలు, ఐరిష్ సరిగా పనిచేయని వారికి అదేవిధంగా 12 ఏండ్లు నిండిన చిన్నారులకు వేలు ముద్రలు, బయోమెట్రిక్, ఐరిష్ అప్‌డేట్ చేయడం తదితర అన్ని రకాల సేవలను ఒకేచోట అందిస్తున్నారు.ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం దేశంలోని ప్రజలందరికీ ఆధార్ కార్డులను జారీ చేస్తున్నది. అయితే ఆధార్ నెంబర్ ఉన్నప్పటికీ వివరాల్లో తప్పుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తప్పులను సవరించుకునేందుకు గతంలో ఈ సేవ, ఆన్‌లైన్ సెంటర్‌లలో ప్రత్యేక సేవలు కొనసాగాయి. కాగా ఈ ఏడాది జనవరి నుంచి ఆధార్ సేవలను బ్యాంకులకు పరిమితం చేశారు. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆధార్ సేవల కోసం ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లను ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 1129, రంగారెడ్డి జిల్లా పరిధిలో 560, మేడ్చల్ జిల్లా పరిధిలో 483 బ్యాంకులున్నాయి. ప్రతి బ్యాంకు తమ బ్రాంచ్‌ల మొత్తం సంఖ్యలో కనీసంగా 10 శాతం బ్రాంచ్‌లలో ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలో 75, మేడ్చల్ జిల్లాలో 28, రంగారెడ్డి జిల్లాలో 50 బ్రాంచ్‌లలో ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
Tags:Aadhaar services in banks

 

పార్వతీపురం పర్యటనలో మంత్రి లోకేష్

Date:26/04/2018
విజయనగరం ముచ్చట్లు:
గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, వారి అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పార్వతీపురంలో రూ.5కోట్లతో నిర్మించిన గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఐటిడిఎ యూత్ ట్రెయినింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో గురువారం నాడు లోకేశ్ సమావేశమై ముఖాముఖీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి సుజయకృష్ణ, జడ్పీ ఛైర్ పర్సన్ స్వాతి రాణి, కలెక్టర్ వివేక్ యాదవ్, ఐటిడిఎ పిఒ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ  మార్చి నాటికి మరో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. 1985లో ఐటిడిఎ ను దివంగత ఎన్టీఆర్ ప్రారంభించారు.  చంద్రబాబు ఐఏఎస్ అధికారులను నియమించారు. గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, అభివృద్ధి లక్ష్యం. ఇందులో భాగంగా వందల కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వమని అన్నారు.  అభివృద్ధి జరిగిందో లేదో యువతే చెప్పాలి. భయపడొద్దని అన్నారు.  ఆంధ్రరాష్ట్రంలో విశాఖపట్నం ని ఐటీ ఆంధ్రగా తీర్చిదిద్దే చర్యలు ప్రారంభమయ్యాయి.  అలాగే శ్రీకాకుళం, విజయనగరం లో కూడా ఐటీ కంపెనీలు రాబోతున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఐటీ కంపెనీలు వొస్తున్నాయి. మార్చినటికి మరో 25వెలమందికి ఉద్యోగాలు రాబోతున్నాయని అన్నారు.
Tags:Minister Lokesh in Parvatipuram tour