పుంగనూరు సీఐగా గంగిరెడ్డి

Date:18/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు అర్భన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎం.గంగిరెడ్డి గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న నాగశేఖర్‌ను వీఆర్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో సీఐడిలో సీఐగా ఉన్న గంగిరెడ్డి ఇక్కడికి వచ్చారు. కాగా గంగిరెడ్డి మాజీ ఎంపీ స్వర్గీయ వివేకానందరెడ్డి సిట్‌ దర్యాప్తుబృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా నూతన సీఐను ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది కలసి శుభాకాంక్షలు తెలిపారు. విలేకరులతో సీఐ గంగిరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యను క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ చూస్తామన్నారు. ప్రజలకు సేవలు అందించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని , ఏ సమాచారాన్ని అయిన నిర్భయంగా అందించాలని కోరారు.

నీటి చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు

Tags: Gangi Reddy as PUNGANURU SEI

నీటి చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:18/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో నీటి చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ కె ఎల్‌.వర్మ హెచ్చరించారు. గురువారం ఆయన పట్టణంలో మంచినీటి సరఫరాపై ఆకస్మిక తనిఖిలు నిర్వహించారు. పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేట, బీడీ వర్కర్స్కాలనీ, ప్రభుత్వాసుపత్రి వద్ద తనిఖిలు చేపట్టగా ప్రజలు కొళాయిలకు మోటార్లుపెట్టి, నీటి చౌర్యం చేయడాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మోటార్లు పెట్టిన ఇంటి యజమానులను ఆయన హెచ్చరించారు. ఇలా మోటార్లు వినియోగిస్తే ఆ కాలనీ వాసులకు నీరు సక్రమంగా సరఫరా కాదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలోని కట్టక్రిందపాళ్యెం, సూర్యనగర్‌, ఉబేదుల్లాకాంపౌండు, ఎన్‌ఎస్‌.పేట, కొత్తపేట, కొత్తయిండ్లు ప్రాంతాలలో నీటి చౌర్యం జరుగుతోందని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. ఈ విధానాన్ని ప్రజలు పూర్తిగా నిరోధించాలన్నారు. మున్సిపాలిటిలో నీటి సమస్య లేకుండ ఉండేందుకు కొళాయిల ద్వారా నీటిని ప్రతి రోజు పంపిణీ చేస్తున్నా మోటార్లు పెట్టడంతో పైతట్టు ప్రాంతాల వారికి పూర్తిగా నీరు సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మున్సిపాలిటిలో ఇలాంటి కార్యక్రమాలను సహించేది లేదన్నారు. ప్రజలను ముందుగా హెచ్చరిస్తున్నామని, మోటార్లు వినియోగించి, నీటిచౌర్యం చేస్తే కొళాయిలు కట్‌ చేసి, జరిమానాలు విధించి, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని, మోటార్లు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ విషయమై మున్సిపల్‌ ఉద్యోగులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ , మోటార్లను సీజ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

కమిషనర్‌ వర్మను సన్మానించిన వ్యాపార సంఘాలు

Tags: Strict action against water infiltration

కమిషనర్‌ వర్మను సన్మానించిన వ్యాపార సంఘాలు

Date:18/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ మూడవ సారి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను సన్మానించారు. గురువారం పట్టణ వర్థక వ్యాపారుల సంఘ అధ్యక్షుడు వెంకటాచలపతిశెట్టి , చాంబర్‌ ఆఫ్‌ కామర్స్ అధ్యక్షుడు బానుప్రకాష్‌, కార్యదర్శి అర్షద్‌అలి , వస్త్ర వ్యాపారుల సంఘ అధ్యక్షుడు ఇనాయతుల్లా షరీఫ్‌, కార్యదర్శి మహేంద్రరావు కలసి శాలువ కప్పి , పూలమాలలు వేసి సన్మానించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ వర్మ మాట్లాడుతూ పట్టణంలో ప్లాస్టిక్‌ వ్యాపారాన్ని నిషేధించినా కొంత మంది వ్యాపారులు రహస్యంగా విక్రయిస్తున్నారని, దీనిని పూర్తిగా నిషేధించేందుకు సహకరించాలని కోరారు. దీనిపై వెంకటాచలపతిశెట్టి మాట్లాడుతూ ప్లాస్టిక్‌ విక్రయాలను పూర్తిగా ఆపివేసేలా సంఘంలో తీర్మాణం చేస్తామని హామి ఇచ్చారు.

రైతులకు సబ్సిడిపై విత్తనాలు

Tags: The trade unions honored Commissioner Verma

చంద్రబాబు ఇంటి కూల్చివేత దిశగా అడుగులు

Date:18/07/2019

విజయవాడ ముచ్చట్లు:

నదీ పరిరక్షణ చట్టానికి తూట్లు పొడుస్తూ కృష్ణా కరకట్టపై సాగిన ఆక్రమ నిర్మాణాలు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కొంప కూల్చే పరిస్థితికి దారి తీసింది. అధికారం వుంది చేతిలో అని విచ్చలవిడిగా చట్ట విరుద్ధంగా కళ్ళముందే అక్రమాలు జరుగుతున్నా వ్యక్తిగత లబ్ది కోసం చూస్తూ ఊరుకోవడం తనకే ఎసరు పెడుతుందని చంద్రబాబు ఊహించలేదు. అసలు అధికారం తన చేతినుంచి దూరం అవుతుందని భావించకపోవడంతో వైసిపి దెబ్బకొడుతుందని అస్సలు అనుకోలేదు. కానీ సీన్ సితార అయిపొయింది.

 

 

 

పార్టీ ఘోర పరాజయం తరువాత వరుసగా చంద్రబాబు లక్ష్యంగా అధికార వైసిపి అక్రమాలను తవ్వి తీసి ప్రజల్లో ఎండగడుతుంది.దీన్ని సమర్ధించుకోవడం మాట ఎటున్నా కనీసం కాపాడుకోవడానికి తెలుగుదేశం అధినేత పడుతున్న తిప్పలు అన్ని ఇన్ని కావు. న్యాయస్థానాల ద్వారా కొంతకాలం జాప్యం చేసే వీలు తప్ప మరే దారి ఆయనకు ప్రస్తుతం కానరావడం లేదు. లింగమనేని కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలు సక్రమమే అని చెప్పుకోలేరు. అన్ని అనుమతులు ఉన్నాయని అడ్డగోలు వాదన తప్ప టిడిపి అధినేత తప్పించుకునే మార్గాలు అన్ని మూసుకుపోతున్నాయి. దాంతో పార్టీకోసం నిర్మించిన కార్యాలయమే మాజీ సిఎం నివాసం అవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 

 

 

 

శాసన మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో మునిసిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని అతిధి గృహం కూల్చివేత తధ్యమన్నది స్పష్టం చేసేసారు. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు కూల్చేస్తామని ఆ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేనే లేవన్నారు. చట్టాలు చేసేవారే వాటికి తూట్లు పొడిస్తే ప్రజలకు ఇచ్చే సందేశం ఏముంటుందని ఆయన టిడిపి అధినేత తప్పును ఎత్తి చూపారు. అన్ని అనుమతులు పొందామని చెబుతున్నారు కానీ చంద్రబాబు ఉంటున్న కట్టడానికి సీఆర్డీఏ అనుమతులు ఏ ఒక్కటి లేవన్నారు. ఈ అక్రమం జరుగుతున్నా చూస్తూ వూరుకున్నందుకు నాడు వున్న సంబంధిత అధికారుల నుంచి 8 కోట్లరూపాయలు వసూలు చేస్తామని హెచ్చరించారు.

 

 

 

 

బొత్స.చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గృహం నిబంధనలు లేకుండా నిర్మితమైందన్నది ప్రభుత్వం గుర్తించింది. సర్కార్ ఏర్పడిన వెంటనే ఆయన్ను మెడపట్టుకు బయటకు పంపిస్తే ప్రజల్లో సానుభూతి వస్తుందన్న దృష్టితో వ్యూహాత్మకంగా జగన్ చర్యలు మొదలు పెట్టారు. ముందుగా ప్రజావేదికను నేలమట్టం చేసి ప్రమాద ఘంటికలు జారీ చేశారు. ఇది అర్ధం చేసుకున్న చంద్రబాబు తన వద్దకు రైతులను, వివిధ వర్గాలను రప్పించుకుని వారు తమ నివాసంలో వుండాలని కోరుతున్నట్లు స్కిట్స్ మొదలు పెట్టి వైసిపి దూకుడుకు బ్రేక్ వేశారు.

 

 

 

 

అయితే బాబు ఇల్లు టార్గెట్ నుంచి వైసిపి సర్కార్ వైదొలగలేదని ఇప్పుడు మరోసారి చట్టసభ వేదికగా తేటతెల్లం అయ్యిపోయింది. సమయం చూసుకుని సర్కార్ విపక్ష నేతను ఆ ఇంటి నుంచి పంపేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదని తేలిపోయింది. మరి చంద్రబాబు కొత్త ఇల్లు వెతుక్కుంటారా ? లేక సానుభూతి కోసం ఆ ఇంటి దగ్గరే ఘర్షణకు దిగుతారా లేక మరో కొత్త వ్యూహం రచించి వైసిపి సర్కార్ ను అడ్డుకుంటారా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

పోలవరం నిజాలు బయిటకొస్తాయి : విజయసాయిరెడ్డి

Tags: Steps towards the demolition of Chandrababu’s house

తిరుమలలో విఐపి దర్శనాలు రద్దు

Date:17/07/2019

తిరుమల ముచ్చట్లు:

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది, విఐపీ దర్శనాలకోసం అమలు చేస్తున్న ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 విధానాలకు బుధవారం నుంచి రద్దు చేసింది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. విఐపి దర్శనాల రద్దు రెండు మూడు రోజుల్లో సాఫ్ట్ వేర్ అప్డేట్ అనంతరం అమలులోకి తీసుకు వస్తాం. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారికి కల్పించాల్సిన మర్యాదలు చేస్తామని అయన వివరించారు.

 

 

ఎక్కువ మంది సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలనే ఉద్దేశం తో ఈ నిర్ణయం తీసుకున్నాం. రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తున్న కారణంగా అక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేయాలనే కోరాను తప్ప,  ప్రత్యేకంగా ఛైర్మన్ క్యాంపు కార్యాలయం ఏర్పాటు కు కోరలేదని అయన అన్నారు.

 

 

టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ పై సుబ్బారెడ్డి మండిపడ్డారు. తండ్రీకొడుకుల్లాగా నేను,మా ముఖ్యమంత్రి దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు. దేవుడు సొమ్ము ఒక్కరూపాయి కూడా నేను తాకను. అవసరమైతే నా చేతి నుంచి పదిమందికి సహాయం చేస్తానని అయన అన్నారు.

పిల్లలకు విషం తాగించి…తానూ తనువు చాలించి 

Tags: Cancel VIP visions at Tirumala

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

Date:17/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం ఆరడిగుంట పాఠశాలలో విద్యార్థులకు బుధవారం నోటుపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామంలో వంటలు చేస్తున్న రెడ్డెప్ప సుమారు రూ.10 వేలు విలువ చేసే పుస్తకాలను కొనుగోలు చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

5 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

Tags: Distributing books to students

పాఠశాల రహదారిలో లారీల పార్కింగ్‌

– ప్రమాదాలు జరిగితే ఎలా .?
– విద్యార్థుల ఆందోళన

Date:17/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఆర్టీసి బస్టాండు నుంచి తాటిమాకులపాళ్యెంకు వెళ్లే 16 అడుగుల రహదారిలో పలు పాఠశాలలు ఉన్నాయి. పాఠశాల రహదారిలో అడ్డంగా లారీలు పార్కింగ్‌ చేయడంతో సగ భాగం రోడ్డుకు అడ్డమౌతోంది. ఈ ప్రాంతంలో లారీలను నిత్యం మరమ్మతులు చేసుకుంటుండటంతో విద్యార్థులకు ప్రమాదాలు జరుగుతుందేమోనని భయంతో తల్లడిల్లిపోతున్నారు. విద్యార్థుల రాకపోకలకు లారీలు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. సుమారు 7 పాఠశాలలకు చెందిన విద్యార్థులు సుమారు 3000 వేల మంది విద్యార్థులు స్కూల్‌ బస్సుల్లో , ఆటోలలో , ద్విచక్రవాహనాలు, సైకిళ్లపైన వస్తుంటారు. ప్రధాన రహదారి కావడంతో లారీల పార్కింగ్‌తో చిన్నారులు ఆ ప్రాంతంలో వెళ్లేందుకు భయంతో తల్లడిల్లిపోతున్నారు. లారీలు అటు ఇటు తిప్పడం, టైర్లు మార్చడం, లగేజిలు మార్పిడి చేస్తుండటంతో ఏ సమయానికి ఏం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని, రహదారిపై లారీల పార్కింగ్‌ తొలగించి, విద్యార్థులకు ప్రమాదాలు జరగకుండ చూడాలని కోరుతున్నారు.

మున్సిపాలిటిలో పారిశుద్ధ్య వారోత్సవాలు

Tags: Truck parking on the school road

మున్సిపాలిటిలో పారిశుద్ధ్య వారోత్సవాలు

Date:17/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలో పారిశుద్ద్య వారోత్సవాలు ప్రారంభించినట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. బుధవారం కమిషనర్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు కలసి మేలుపట్లలో మురుగునీటి కాలువల్లో నీటిని తొలగించే కార్యక్రమం చేపట్టారు. అలాగే గోకుల్‌ సర్కిల్‌, ఎంబిటి రోడ్డు, కొత్తపేట, ఎల్‌ఐసి కాలనీలలో రోడ్లకు ఇరువైపుల చెత్తను శుభ్రం చేశారు. పట్టణంలోని రహదారులు అన్ని సిబ్బందిచే దుమ్ముదుళిపే కార్యక్రమం చేపట్టారు. వీటితో పాటు స్పీపింగ్‌ మిషన్లచే దుమ్మును తొలగించారు. అలాగే పట్టణంలో నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేసి, చెట్ల పాదులను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ వర్మ మాట్లాడుతూ మున్సిపాలిటిలో ప్రజల ఆరోగ్యానికి భంగం కలగకుండ ఉండేందుకు ప్రతి రోజు అన్ని వార్డులలోను యుద్ధప్రాతిపదికన శానిటేషన్‌ కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. వారోత్సవాలుగా నిర్ణయించి, పట్టణాన్ని స్వచ్చ పుంగనూరుగా చేస్తామన్నారు. మామిడి పండ్ల సీజన్‌ కావడంతో దోమల బెడద తీవ్రంగా ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పగటిపూట ఫాగింగ్‌ నిరంతరం కొనసాగిస్తామన్నారు. అలాగే మురుగునీటి నిల్వలు లేకుండ చేసి, అబేట్‌ స్ప్రీ , ఫినాయిల్‌, బ్లీచింగ్‌ చేపట్టామన్నారు. పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌, కార్మిక సంఘ నాయకుడు శ్రీరాములు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌డబ్యూజ్లిఎస్‌డీఈని కలసిన నేతలు

Tags: Sanitation Weekends in the Municipality