బడిపిల్ల‌లంద‌రికీ త‌క్ష‌ణ‌మే డ్రై రేష‌న్ పంపిణీ

Date:10/09/2020

విజ‌య‌న‌గరం ముచ్చట్లు:

మ‌ధ్యాహ్న భోజ‌నానికి బ‌దులుగా ప్ర‌భుత్వం ఇస్తున్న‌ డ్రైరేష‌న్ ను అర్హ‌త ఉన్న విద్యార్థులంద‌రికీ త‌క్ష‌ణ‌మే పంపిణీ చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జె.వెంక‌ట‌రావు అధికారుల‌ను ఆదేశించారు. విద్యార్థుల‌కు డ్రైరేష‌న్ పంపిణీపై విద్యాశాఖ‌, వివిధ సంక్షేమ శాఖ‌ల అధికారుల‌తో త‌న ఛాంబ‌ర్‌లో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జెసి వెంక‌ట‌రావు మాట్లాడుతూ జిల్లాలో సుమారు ల‌క్షా, 79వేల‌, 530 మంది విద్యార్థుల‌కు గ‌త విద్యాసంవ‌త్స‌రంలో మ‌ధ్యాహ్న భోజ‌నం అందేద‌ని చెప్పారు. మార్చి 19 న పాఠ‌శాల‌లు మూత‌బ‌డిన త‌రువాత నుంచి ఏప్రెల్ వ‌ర‌కూ, ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కారం మొద‌టి విడ‌త‌గా డ్రైరేష‌న్ పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఆ త‌రువాత కూడా సుమారు ల‌క్షా, 60వేల మంది విద్యార్థుల‌కు ఆగ‌స్టు వ‌ర‌కూ పంపిణీ పూర్త‌య్యింద‌ని తెలిపారు. అయితే కొంత‌మంది ఇత‌ర మండ‌లాలు, జిల్లాల‌కు చెందిన హాస్ట‌ల్ విద్యార్థులు,  త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిపోవ‌డంతో,  వారికి డ్రైరేష‌న్ పెండింగ్‌లో ఉంద‌న్నారు. అటువంటి విద్యార్థులంద‌రినీ గుర్తించి పంపిణీ పూర్తి చేయాల‌ని ఆదేశించారు.డ్రైరేష‌న్ క్రింద ప్ర‌తీ విద్యార్థికి నెల‌కు సుమారు 12.5 కిలోల బియ్యం, గుడ్లు, చిక్కీల‌ను పంపిణీ చేయాల్సి ఉంద‌ని చెప్పారు. క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ వ‌ల్ల చాలామంది త‌ల్లితండ్రుల‌ ఉపాధికి గండిప‌డి చితికిపోయిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని, ఇలాంటి స‌మ‌యంలో ఈ డ్రైరేష‌న్ విద్యార్థుల‌కు చాలా అవ‌స‌ర‌మ‌ని అన్నారు. అందువ‌ల్ల సిబ్బంది మ‌రింత చిత్త‌శుద్దితో కృషి చేసి, అర్హ‌త ఉన్న ప్ర‌తి విద్యార్థికీ డ్రైరేష‌న్ స‌రుకుల‌ను వారి ఇళ్ల‌వ‌ద్ద‌కే పంపించాల‌ని, అంద‌రికీ త‌ప్ప‌నిస‌రిగా అందేలా చూడాల‌ని జెసి వెంక‌ట‌రావు కోరారు.

 

వరాహ నదిలో పడిపోయిన బస్సు…తృటిలో తప్పిన పెను ప్రమాధం

Tags:Immediate dry ration distribution to all children

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *