నీట మునిగిన పంటపోలాలు

Immersed crops

Immersed crops

Date:14/12/2019

సుర్యాపేట ముచ్చట్లు:

సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గ్రామం లో పంట పోలాలు నీట మునిగాయి. ఫణిగిరి గ్రామానికి పక్కనే ఉన్న చెరువు కట్ట తెగిపో వడంతో దాదాపుగా 350 ఎకరాలలో వరి పంట నీట మునిగింది. పంట పొలాలు మొత్తం చేర్వులా తలపిస్తున్నాయి. వీరి గోడును పట్టించుకునే నాధుడే లేడని బాధితులు వాపోతున్నారు. ఆరు నెలలు కష్టపడి పండించిన వరి పంట చేతికందే సమయంలో నీట మునిగి మొలకలు రావడంతో నష్ట పోయామని రైతులు లబోదిబోమంటున్నారు. నీట మునిగిన వరి పంట కోయడానికి రైతులు, వరి కోత మిషన్లు రాకపోవడంతో వారు నడుము లోతు నీటిలో కి వెళ్లి వరిపంట ను కోసుకుని నీటిలో నావా లాగా వరిపంటను వేసుకొని పక్కనే ఉన్న రోడ్డుపై వేస్తూ తన బాధను చెప్పుకుంటున్నారు. ఈ చెరువు కట్ట తెగి దాదాపుగా  దాదాపుగా 30 రోజులు కావస్తున్నా ఇటు గ్రామపంచాయతీ గాని అటు సంబంధిత అధికారులు గానీ పట్టించుకోవడం లేదు అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పంట నీటమునిగి మొలకలు రావడంతో దాదాపుగా ఒక్కొక్క రైతు లక్షల నష్ట పోయామని మాకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. తెగిన  చెరువు కట్ట ను సంబంధిత అధికారులు చొరవ తీసుకుని మరమ్మతులు చేపిస్తే పంట పొలంలో ఉన్న నీటి నిల్వలు ఆగిపోయి వరి పంట చేతికి అందుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయమే జీవనాధారం అయిన రైతులు నోటి దగ్గరికి వచ్చిన వరి పంట చేతికి రాక పోవడంతో ఏమి చేయాలో తోచక తమ పంటలను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్న రైతులు.

 

జగన్ ప్రభుత్వంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసల జల్లు..!

 

Tags:Immersed crops

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *