Natyam ad

రామసముద్రంలో ఘనంగా గణేష్ నిమజ్జనాలు

రామసముద్రం ముచ్చట్లు:

రామసముద్రం మండల కేంద్రంలోని గాజులనగర్, కోటవీధి, కారణాల వీధి, ఎగువ పాళ్యంలో వెలసిన వినాయకుని నిమజ్జనాలు ఐదవ రోజైన ఆదివారం ఘనంగా నిర్వహించారు. యువకులు ఉత్సహంతో, ఉల్లాసంగా కేరింతలతో నిమజ్జనాలలో పాల్గొన్నారు. బళ్లారి డ్రమ్ముల వాయిద్యాలు , భారీ టపకాయల శబ్దాలతో రంగులు చల్లుకుంటూ ఊరేగింపు చేశారు. గణపతి బొప్పా మోరియా అనే నినాదాలతో మండల కేంద్రం మారుమోగింది. ఇంటింటా మహిళలు బొజ్జ గపయ్యకు కర్పూర హారతులు అందించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సమీపంలో ని చెరువులో నిమజ్జనాలు చేశారు.

 

Post Midle

Tags: Immersion of Lord Ganesh in the Ram Sea

Post Midle