నిమజ్జనం మొదలైంది.. ట్రాఫిక్ ఆంక్షలు షురూ..

Immersion started .. traffic sanctions shuru ..

Immersion started .. traffic sanctions shuru ..

Date:15/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు :
నగరంలోని నాంపల్లి రైల్వేస్టేషన్‌లో సిగ్నలింగ్‌ పనుల వల్ల ఈ నెల 15, 16 తేదీల్లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు 15వ తేదీన లింగంపల్లి –నాంపల్లి రైల్వేస్టేషన్‌ల మధ్య 10 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేశారు. ఆదివారం ( 16వ తేదీన) లింగంపల్లి– ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి మార్గాల మధ్య 3 ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు చేయనున్నట్లు సమాచారం.
హైదరాబాద్‌–కొచువెలి స్పెషల్‌ ట్రైన్… నాంపల్లి స్టేషన్‌ నుంచి కాకుండా సికింద్రాబాద్‌ నుంచి 15వ తేదీ రాత్రి 9.40 కి బయలుదేరుతుంది. తాండూరు– హైదరాబాద్‌ ప్యాసింజర్‌ను లింగంపల్లి వరకే నడుస్తుంది.. పూర్ణ –హైదరాబాద్‌ ప్యాసింజర్‌ నేడు పూర్ణ నుంచి లింగంపల్లి వరకే వెళ్తుంది.విగ్రహాల నిమజ్జనం నుంచి ప్రారంభమవుతుంది. నేటి నుంచి 22వ తేదీ వరకు హుస్సేన్‌సాగర్‌ చుట్టూ నిమజ్జనం కోలాహలం నెలకొంటుంది. దీంతో సాగర్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్‌ అంజనీ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు విధించిన ప్రాంతాల సమాచారం తెలుసుకుని ప్రయాణించడం ఉత్తమమని, వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ఉంటుందని ఆయన సూచించారు.కర్బాలామైదాన్‌ నుంచి వచ్చే వాహనాలను అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు అనుమతించరు. వీటిని కవాడిగూడ చౌరస్తా మీదుగా పంపిస్తారు. లిబర్టీ వైపు వెళ్లే వాహనదారులు కవాడీగూడ చౌరస్తా, గాంధీనగర్‌ టి జంక్షన్, డీబీఆర్‌ మిల్స్, ఇందిరాపార్క్, దోమలగూడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
ఖైరతాబాద్, పంజగుట్ట వైపు వెళ్లే వాహనాలు రాణిగంజ్, నల్లగుట్ట, సంజీవయ్య పార్క్, నెక్లెస్‌రోడ్, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ మీదుగా వెళ్తే సౌకర్యంగా ఉంటుంది.ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్‌ మీనార్‌ వైపు పంపిస్తారు. సికింద్రాబాద్‌ వైపు వెళ్లే వాహనదారులు తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ టెంపుల్, డీబీఆర్‌ మిల్స్, చిల్డ్రన్‌ పార్క్, సెయిలింగ్‌ క్లబ్, కర్బాలామైదాన్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుందని ప్రకటనలో వెల్లడించారు.
గోశాల వైపు నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను డీబీఆర్‌ మిల్స్, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా అనుమతిస్తారు.ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ వైపు నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు అనుమతించరు. ఆ వాహనాలను నెక్లెస్‌ రోడ్‌ లేదా మింట్‌ కాంపౌండ్‌ మీదుగా పంపించనున్నట్లు కమిషనర్ అంజనీ కుమార్‌ పేర్కొన్నారు.
Tags:Immersion started .. traffic sanctions shuru ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *