అర్హులైన ప్రతి ఒక్కరికి వైఎస్సార్ రైతు భరోసా అమలు

Date:09/11/2019

తుగ్గలి/మద్దికెర ముచ్చట్లు:

అర్హులైన ప్రతి ఒక్క రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం వర్తిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేశారు.తుగ్గలి మండలం పరిధిలోని  ఎద్దుల దొడ్డి గ్రామంలో  ఏడి ఖాద్రి, ఏవో కృష్ణ కిషోర్ రెడ్డి లు రైతుల ద్వారా అర్జీలను స్వీకరించారు.తుగ్గలి,మద్దికెర మండల పరిధిలోని అన్ని పంచాయతీలలో గ్రామ సచివాలయాల వద్ద వ్యవసాయ శాఖ అధికారులు,రెవెన్యూ శాఖ అధికారులు రైతు భరోసా పథకంపై రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు.రైతుల యొక్క సమస్యలను అధికారులు అక్కడికక్కడే పరిష్కరించారు. తుగ్గలి రెవెన్యూ పరిధిలో మంచి ప్రజా సాధికార సర్వే 8,డెత్ సమస్యలు 1,కొత్త పాసుపుస్తకాల సమస్యలు 7,8 మంది అర్హత ఉండి ఎన్పిసిఐ సమస్య కలిగిన రైతుల సమస్యలను పరిష్కరించామని అధికారులు తెలియజేశారు. జొన్నగిరి పరిధిలో డెత్ సమస్యలు 4, కొత్త పాస్ పుస్తకాలు సమస్యలు 4, మరియు ఎంపీ సీఐ సమస్య కలిగిన రైతు సమస్యలను పరిష్కరించామని అధికారులు తెలియజేశారు. మద్దికెర మండల పరిధి మొత్తంపై 174 మంది రైతులకు సంబంధించి రైతు భరోసా పెండింగ్ లో ఉన్నాయని ఏవో హేమలత తెలియజేశారు. ఇందులో ముఖ్యంగా 85 బ్యాంక్ ఎన్పీసీఐ సమస్యలు,35 కొత్త పాస్ పుస్తకాలు సమస్యలు, 2 డెత్ సమస్యలు,5 మంది రైతులకు సాధికార సర్వేలను పూర్తిచేశామని ఎ.ఓ హేమలత తెలియజేసారు.రైతు భరోసా అందని రైతుల సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరించి వారికి రైతు భరోసా పథకం వర్తించేలా చూస్తామని హేమలత తెలియజేశారు. ఈ స్పందన కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్లు, రెవెన్యూ శాఖ అధికారులు,వీఆర్వోలు,వ్యవసాయ విస్తరణ అధికారులు,ఎంపీఈఓలు,వీఆర్ఏలు, వాలంటీర్లు మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

పోలీస్ లాఠీలతో ఉద్యమాలను ఆపలేరు

 

Tags:Implementation of YSSAR Farmer ensuring everyone is eligible

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *