Improved growth in employment

ఉపాధిలో ఆగని అభివృద్ధి

– ముత్తంశెట్టి విశ్వనాథ్‌

Date:29/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

కరోనా వ్యాధితో ప్రజలు అవస్థలు పడుతున్నా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గ్రామీణ ఉపాధిహామి పథకంలో కూలీలకు పనులు కల్పించి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఉపాధిహామి రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌ తెలిపారు. శుక్రవారం ఆయన రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ కార్యదర్శి పెద్దిరెడ్డి, ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డితో కలసి పుంగనూరు నియోజకవర్గంలో ఉపాధిహామి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అభ్యర్థి భాస్కర్‌రెడ్డి బృందం కలసి విశ్వనాథ్‌ను శాలువకప్పి సన్మానించారు. ఆయన మండలంలోని చదళ్ల చెరువులో రూ.28 లక్షలతో నిర్మిస్తున్న చేపల చెరువును పరిశీలించి కూలీలకు మాస్క్లు, సోపులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూలీలతో పనులు గూర్చి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి సహకారంతో ఉపాధి కూలీలకు అధనపు వేతనం పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. అలాగే కూలీల పని దినాలను వంద రోజుల నుంచి పెంచేందుకు మంత్రి పెద్దిరెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కూలీలకు పని కల్పించేందుకు రైతులకు అవసరమైన పనులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా నియంత్రణలో భాగంగా ఉపాధి కూలీలు వలసలు వెళ్లకుండ ప్రతి గ్రామంలోను ఉపాధిపనులు కల్పించిన ఘనత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. కూలీలు ఉపాధి పనులు చేపట్టి, ఆర్థికంగా బలోపేతమై, కుటుంబ పోషణ చేసుకోవాలని కోరారు. ఉపాధి కూలీలకు ఎలాంటి కష్టంలోనైనా అండగా నిలిచేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు, ఏపీడీలు చందన, శ్రీనివాసులు, ఏపీవో శ్రీనివాసులు, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌, మండల పార్టీ అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ నేతలు బాలచంద్రారెడ్డి , నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పేదలు మద్యపానం తో చితికి పోకూడదనేదే ముఖ్యమంత్రి ఆశయం.

Tags: Improved growth in employment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *