10 రోజుల్లో..తొలివిడత నామినేటెడ్ పోస్టులు

* పనితీరు, సమర్థత ఆధారంగా ఎంపిక

మిత్రపక్షాలకు 18-20 శాతం పోస్టులు

సీఎం చంద్రబాబు విస్తృత కసరత్తు

 

అమరావతి ముచ్చట్లు:

 

నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు త్వరలోనే శుభవార్త అందనుంది. నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న విస్తృత కసరత్తు దాదాపు తుదిదశకు వచ్చింది. మరో వారం, పది రోజుల్లో తొలివిడత భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. ఎన్డీయే మిత్రపక్షాలైన జనసేన, భాజపాలకు 18-20% పోస్టులు కేటాయించనున్నారు.ఆ పార్టీలు పోటీచేసిన నియోజకవర్గాలలోనే నామినేటెడ్ పోస్టులూ ఇస్తారు.పని తీరు, సమర్థత, పార్టీపై అంకిత భావం వంటి అంశాలే వీటికి ప్రాతిపదిక. పార్టీ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఎవరు కష్టపడి పనిచేశారు? పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ఎవరు అంకితభావంతో నిర్వహించారు? ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల కోసం చిత్తశుద్ధితో పనిచేసినవారు ఎవరనే అంశాల ప్రాతిపదికన రెండు, మూడు నివేదికలు అధినేత తెప్పించుకున్నారు.పార్టీ ఎమ్మెల్యేలు,నియోజకవర్గ ఇన్చార్జుల నుంచి విడిగా ప్రతిపాదనలు తీసుకున్నారు.మిత్రపక్షాల నాయకులతోనూ చంద్రబాబు విస్తృతంగా చర్చించి, అభిప్రాయాలు తెలుసుకున్నారు. వాటన్నింటినీ క్రోడీకరించి పనితీరు, సమర్థతకు మొదటి ప్రాధాన్యమిస్తూ,అదే సమయం లో సామాజిక, ప్రాంతీయ సమీకరణాల్ని బేరీజు వేసుకుంటూ, సమతూకం పాటిస్తూ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోస్టుల వరకు ఇదే సూత్రాన్ని పాటించనున్నారు. పోస్టులు తక్కువ, నాయకుల్లో ఆకాంక్షలు ఎక్కువగా ఉండడంతో ఎక్కువ కసరత్తు అవసరమైంది.పోస్టులన్నీ ఒకేసారి భర్తీ చేయకుండా, దశలవారీగా ఆ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు తెదేపా వర్గాల సమాచారం సమాచారం.

 

Tags:In 10 days..first batch of nominated posts

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *