2019 లో బిజెపి కి 110 సీట్లే … శివసేన

Date:16/03/2018
ముంబయి  ముచ్చట్లు:
ముంబయి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీఏ మిత్రపక్షమైన శివసేన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి100నుంచి 110స్థానాల వ‌ర‌కు త‌గ్గుతాయ‌ని అంచ‌నా వేసింది. 2014తో పోలిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి 100నుంచి 110స్థానాల వ‌ర‌కు త‌గ్గుతాయ‌ని శివ‌సేన పేర్కొంది.. రెండు రోజుల క్రితం వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుందని అంచనా వేసింది. వారం క్రితం వెల్లడైన ఈశాన్య రాష్ర్టాల అసెంబ్లీ ఫలితాల్లో సత్తాచాటి,త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంబరాలు చేసుకోవడంలో బిజీగా ఉన్నప్పటికీ గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్‌లో వెలువడిన లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీని ఓడించి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో కమలం క్యాంపులో భయం మొదలైందని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో వివరించింది. 2014లో ప్రజాదరణతో బీజేపీ విజయం సాధించిందని, ప్రస్తుతం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అందులో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటి మాత్రం స్పష్టమవుతోంది. అన్నింటికన్నా 2019లో బీజేపీ సంఖ్య 280కాదు, అందులో కనీసం 100-110 త‌గ్గుతాయ‌ని హెచ్చరించింది.
Tags: In 2019, the BJP has 110 seats … Shiv Sena

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *