In a democracy, between the religions ..?

ప్రజాస్వామ్యంలో మతాల మధ్య చిచ్చుపెడుతారా..?

– 12వ రోజు కొనసాగిన దీక్షలు
– జాతీయపతాకంతో ప్రదర్శన

Date:22/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజాస్వామ్యదేశంలో మతాల మధ్య ప్రభుత్వమే చిచ్చుపెడుతోందని ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలోని మేలుపట్ల మసీదుకు చెందిన ముస్లింలు 12వ రోజు నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లింలు అతిపెద్ద జాతీయ పతాకాన్ని పట్టుకుని మేలుపట్ల నుంచి ఇందిరాసర్కిల్‌ వరకు ప్రదర్శన చేశారు. మేలుపట్ల ముతవల్లి నూర్‌ ఆధ్వర్యంలో దీక్షల్లో బైఠాయించారు. ఈ సందర్భంగా నూర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష విధానాలతో పౌరసత్వ సవరణ చట్టం ప్రవేశపెట్టడం బాధకరమన్నారు. తక్షణమే దీనిని రద్దు చేయాలని,డిమాండ్‌ చేశారు. అలాగే ఎన్‌ఆర్‌సీ,సీఐఏ, ఎన్‌ఆర్‌పీలను వ్యతిరేకిస్తున్నామని హెచ్చరించారు. భారతదేశంలోని పౌరులందరికి నివశించే హక్కు , జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. ఇందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే స్పందించి, చట్టాన్ని రద్దు చేయాలని లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీక్షా శిబిరంలో ప్లకార్డులు పట్టుకుని బైఠాయించారు.

మున్సిపాలిటికి కలెక్టర్‌ ప్రశంసలు

Tags: In a democracy, between the religions ..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *