మరో వివాదంలో అమిత్ షా

Date:20/09/2018
ముంబై ముచ్చట్లు:
నోట్లరద్దు సమయంలో కష్టాలు గుర్తున్నాయా ? ఒక్క వెయ్యినోటు…మార్పిడి చేసుకోవటానికి సామాన్య పౌరులు ఎంతో అవస్థ పడ్డారు. నాలుగువేలు మార్చడానికి బ్యాంకులు నానా రకాల నిబంధనలు పెట్టి ఇబ్బంది పెట్టాయి. ప్రతి భారతీయుడు ఆ కష్టం పడ్డారు.
అప్పట్లో దేశం కోసం కదా అని అందరూ భరించారు కూడా. కాని రాను రాను ఇది ఒక విఫల ప్రయోగం అని ప్రజలు గ్రహించారు. ఇప్పుడు ఇది ఒక పెద్ద స్కాంగా కూడా వార్తలు వస్తున్నాయి. అప్పట్లో వెయ్య నోటు మార్చటానికి సామాన్యుడు ఇబ్బంది పడితే, అదే బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా విషయానికొచ్చేసరికి వందల కోట్ల రూపాయల పాత నోట్ల మార్పిడికి ఎలాంటి అడ్డంకులు రాలేదు.
అమిత్‌ షా డైరెక్టర్‌గా ఉన్న ‘అహ్మదాబాద్‌ డిస్ట్రిక్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌’ (ఏడీసీసీబీ) రూ.745.59కోట్ల విలువ చేసే రద్దయిన పాత నోట్లను మార్పిడి చేసిందని, పెద్ద మొత్తంలో పాత నోట్ల మార్పిడి జరిపిన బ్యాంకుల్లో దేశంలోనే ‘ఏడీసీసీబీ’ ముందుందని తేలింది. అమిత్‌ షా ఒక్కడే కాదు,
బీజేపీ, కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌, శివసేనకు చెందిన వివిధ నాయకుల నేతృత్వంలో నడుస్తున్న కో ఆపరేటివ్‌ బ్యాంకులు ‘పాత నోట్ల మార్పిడి’లో దేశంలోనే ముందున్నాయని ఒక ఆంగ్ల జాతీయ దినపత్రిక తాజాగా కథనం వెలువరించింది. ‘సమాచార హక్కు’ ద్వారా ‘నాబార్డ్‌’ నుంచి సేకరించిన సమాచారంతో రూపొందించిన అంశాలు ఇలా ఉన్నాయి..నోట్ల రద్దు సమయంలో పెద్ద ఎత్తున పాత నోట్ల మార్పిడి జిల్లా కోఆపరేటివ్‌ బ్యాంకుల ద్వారా జరిగింది.
టాప్‌-10 బ్యాంకుల్లో నాలుగు గుజరాత్‌, నాలుగు మహారాష్ట్రలో ఉండటం గమనార్హం. ఒకటి హిమాచల్‌ ప్రదేశ్‌, ఒకటి కర్నాటకలో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 370 డీసీసీబీలలో రూ.22,270కోట్ల పాత నోట్ల మార్పిడి జరిగింది. ఇందులో 19 శాతం, అంటే రూ.4,191 కోట్ల పాత నోట్ల మార్పిడి కేవలం 10 డీసీసీబీ బ్యాంకుల్లో చోటుచేసుకుంది.
ఈ టాప్‌-10 డీసీసీబీ బ్యాంకుల్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా డైరెక్టర్‌గా ఉన్న ‘అహ్మదాబాద్‌ డిస్ట్రిక్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌’ మొదటి స్థానంలో (రూ.745కోట్లు) ఉంది. తర్వాత స్థానంలో రాజ్‌కోట్‌లోని డీసీసీబీ (రూ.693కోట్లు) ఉంది. ఈ బ్యాంకుకు ఛైర్మెన్‌గా జయేష్‌భారు విఠల్‌భారు రాడాడియా(గుజరాత్‌ రాష్ట్ర మంత్రి) ఉన్నారు. మరి ప్రధానమంత్రి గారు, ఈ విషయం పై స్పందిస్తారా ? మాటల్లో చెప్పే నిజాయితీ, చేతల్లో చూపిస్తారా ?
Tags: In another controversy, Amit Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *