అప్ప‌లాయ‌గుంటలో శాస్త్రోక్తంగా ప‌విత్రోత్స‌వాలు ప్రారంభం

తిరుప‌తి ముచ్చట్లు:

 

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధ‌వారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన చేప‌ట్టారు. ఆ త‌రువాత‌ యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుక‌గా జరిగింది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు.ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈవో  ప్ర‌భాక‌ర్ రెడ్డి, సూప‌రింటెండెంట్  శ్రీ‌వాణి, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ వెంక‌ట‌శివ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Tags:In Appalayagunta, the Purification Festival begins scientifically

Leave A Reply

Your email address will not be published.