రెండు విధాలా కమలానికి నష్టమే

విజయవాడ ముచ్చట్లు :
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఇటు రెండు విధాలుగా ఇబ్బంది పడుతుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలసి వెళుతుందన్న ప్రచారం ఒకవైపు, లేదు వైసీపీతో సఖ్యతగానే ఉంటుందన్న వార్తలు మరోవైపు ఆ పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాయి. దీంతోబీజేపీ నేతలు టోన్ పెంచారు. అధికార వైసీపీ, విపక్ష టీడీపీలపై విరుచుకుపడుతున్నారు. ప్రజల్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు ఏపీ బీజేపీ నేతలు ఇటీవల కాలంలో తంటాలు పడుతున్నారు. నిన్న మొన్నటి దాకా బీజేపీ నేతలు తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడేవారు. చంద్రబాబు పాలన జరిగిన తప్పులను ఎత్తి చూపేవారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ కలుస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. దీనికితోడు చంద్రబాబు సయితం అదే రకమైన సంకేతాలు పంపుతున్నారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేయకపోవడం, మహానాడులో కేంద్రప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రకటించడం కూడా రాష్ట్ర బీజేపీని ఇరకాటంలో పడేశాయి.అందుకే తాము ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో పొత్తుపెట్టుకునే పరిస్థిితి లేదని బీజేపీ నేతలు పదే పదే చెప్పుకోవాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే వైసీపీ కూడా తమ ఎదుగుదలకు అడ్డంకిగా మారిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇటీవల జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత కేంద్ర ప్రభుత్వం జగన్ కు అనుకూలంగా ఉందన్న సంకేతాలు బలంగా వచ్చాయి. జగన్ సహకారం కోసం బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రయత్నిస్తుందన్న ప్రచారమూ ఉంది.దీంతో వైసీపీతో కూడా రాజకీయంగా తమకు ఇబ్బందులు వస్తాయని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతుంది. రైతు సమస్యలపై నేరుగా ఆందోళనకు దిగింది. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై రచ్చ చేసింది. ఎప్పుడూ వైసీపీని ఒక మాట కూడా అనని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సయితం వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీన్ని బట్టి ప్రజల్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు తాపత్రయపడుతున్నారని అర్థమవుతుంది.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:In both cases there is a complete digestive tract

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *