చెర్వుగట్టు లో సిబ్బంది చేతివాటం
నల్గోండ ముచ్చట్లు:
నల్లగొండ జిల్లా పరిధిలోని, చెర్వుగట్టు దేవస్థానములో కొందరి ప్రైవేట్ ఉద్యోగుల చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రతినెల అమావాస్య సందర్భంగా చెరువుగట్టుకు భక్తులు పోటెత్తుతుంటారు. ఈ రద్దీ రోజుల్లో ముడుగుండ్ల దర్శనానికి వెళ్లే భక్తులకు 10రూ, 50రూ టికెట్స్ తీసుకొని వెళుతుంటారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది ప్రైవేటు ఉద్యోగులు, దళారులు.. దేవస్థానం పేరిట నకిలి టికెట్ బుక్స్ ని ముద్రించి భక్తులకు విక్రయం చేస్తున్నారు. ప్రతి అమావాస్య రోజున 8 నుంచి 10 వేల టికెట్లు అమ్ముడు పోతుంటాయి. ఈసారి మాత్రం.. కేవలం 3వేల టికెట్ల అమ్మకం జరగడంతో ఈవో నవీన్ ఫోకస్ పెట్టారు. దీంతో నకిలీ కేటుగాళ్లు, దళారుల దందా వ్యవహారం బయటపడింది. రెడ్ హ్యాండెడ్ గా నకిలీ టికెట్ల ను అమ్ముతుండగ పట్టుకున్న ఇంచార్జి ఈఓ నవీన్, అక్కడ విధులు నిర్వహిస్తున్న 8మందికి స్దాన చలనం చేసి వారిపై విచారణకు ఆదేశలు జారీ చేశారు. దేవస్థానం ఆదాయానికి గండి కొడుతున్న ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్ చేస్తున్నారు. సాధారంగా ప్రతి అమావాస్య కు 10వేలకు పైగా దర్శన టికెట్స్ అమ్ముడు పోతాయి, కానీ గత అమావాస్య నుంచి కేవలం 3వేల టికెట్స్ అమ్ముడు పోయినట్లు చూపించడంలో ఈఓ కి అనుమానం వచ్చింది.
Tags: In Chervugattu, the staff were handcuffed

