Natyam ad

 డోలాయమానంకోమటిరెడ్డిలో 

నల్గోండ ముచ్చట్లు:

 

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువగిరి పార్టీ మారుతున్నారా? మారే ఆలోచన చేస్తున్నారా? అంటే, అవునని చెప్పలేము.  కాదనీ అనలేము. అయన పార్టీ మార వచ్చు, మారక పోనూ వచ్చు. నిజానికి ఈ చర్చ ఈ రోజుది కాదు. పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూసిన నాటి నుంచి, కోమటి రెడ్డి అసంతృప్తితో రగిలిపోతూనే ఉన్నారు. అలాగే,  అనేక సందర్భాలలో అసంతృప్తి బాహాటంగా వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. పార్టీ మారే అలోచన చేస్తున్నారనే వదంతులు వినిపిస్తూనే ఉన్నాయి. మరోవంక ఆయన సోదరుడు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి, బీజేపీలో చేరిన తర్వాత అయితే ఆ వదంతులు ఇంకా బలంగా వినిపించాయి. అయినా, వెంకట రెడ్డి పార్టీ మారలేదు. చేయి వదల లేదు

 

 

 

Post Midle

. హస్తం పార్టీలోనే కొనసాగుతున్నారు. రాజగోపాల రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగినా, వెంకట రెడ్డి తమ్ముడి తరపున ప్రత్యక్షంగా ప్రచారం చేయలేదు. అలాగే, కాంగ్రెస్ స్టార్  క్యాంపైనర్ పదవిలో ఉండి కూడా కాంగ్రెస్ అభ్యర్ది పాల్వాయి స్రవంతి పక్షాన ప్రచారంలో పాల్గొన లేదు. ఆస్ట్రేలియా  వెళ్లి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తిరిగొచ్చారు. అయినా  ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాంటే ఉన్నారు అన్నట్లుగానే ఉన్నారు. అప్పుడప్పుడు సంచలన ప్రకటనలు, వివాదస్పద వ్యాఖ్యలు  చేయడం మినహా పెద్దగా రాజకీయ వేదికల మీద కనిపించడం లేదు.  మరో వంక రేవత్ రెడ్డి వర్గం కూడా ఏదో విధంగా  కోమటి రెడ్డిని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తూనే వస్తోంది. రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ వంటి నాయకులు వెంకట రెడ్డిని రెచ్చగొడుతున్నారు. అయితే

 

 

 

,ఆయన ఒకసారి రెచ్చిపోయినా, మళ్ళీ అంతలోనే సర్దుకు పోతున్నారు. తెగే దాకా లాగకుండా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఒక విధంగా కోమటి రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య   టామ్ అండ్ జెర్రీ ఫైట్ నడుస్తోంది. అయితే, ఇప్పటికిప్పుడు కాకపోయినా కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని,  అదే సమయంలో ఆయన బీజేపీలో చేరే విషయంలోనూ ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోరని అంటున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆశిస్తున్న లేదా అంచనా వేస్తున్న విధంగా హంగ్ అసెంబ్లీ వచ్చి, కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతులు కలిపితే  కోమటి రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతారు. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే  అప్పుడు ఆయన కాంగ్రెస్ లో కొనసాగడమా, బీజేపీ తీర్ధం పుచ్చుకోవడమా అనే విషయంలో ఓక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.  ఈ నేపధ్యంలో కోమటి రెడ్డి పార్టీ మార్పుపై ఎన్నికలకు నెల ముందు మాట్లాడతా.. అంటూ చేసిన ప్రకటన సంచలనంగా మారింది

Tags:In Dolayamanankomati Reddy

Post Midle