జమ్ము కశ్మీర్‌లో ఘోర రోడ్డుప్రమాదం, 20 మంది 

Jammu Kashmir was the worst road accident. At least 20 people were killed and another 16 were seriously injured in a mini bus accident.
Date:06/10/2018
శ్రీనగర్  ముచ్చట్లు:
జమ్ము కశ్మీర్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మినీ బస్సు లోయలో పడిన ఘటనలో 20 మంది మరణించగా.. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. జమ్ము  శ్రీనగర్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
ఓవర్ లోడ్, అధిక వేగం కారణంగా బస్సు డ్రైవర్.. వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఘాట్ రోడ్డుపై ఓ మలుపు వద్ద అదుపుతప్పిన బస్సు 200 అడుగుల లోయలోకి పడిపోయింది. దీంతో డ్రైవర్‌తో పాటు 20 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
సహాయ చర్యల్లో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు.ప్రమాదం జరిగిన ప్రదేశంలో కొండ వాలు ఎక్కువగా ఉండటంతో సహాయ కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్‌ల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు రామ్‌బన్ నుంచి బనిహాల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Tags:In Jammu Kashmir, the worst road accident, 20 people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *