కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ దక్షిణామూర్తిస్వామివారి హోమం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం శాస్త్రోక్తంగా జరిగింది.ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట, దక్షిణామూర్తి స్వామివారి హోమం, పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు.జనవరి 20న శ్రీ దుర్గా, లక్ష్మీ, సరస్వతి హోమం, చివరిరోజైన జనవరి 21న శ్రీ రుద్ర, మహామృత్యుంజయ హోమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈవో పార్థసారథి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:In Kapilatheertha, Sri Dakshina Murthyswamy’s Homa is Sastroktanga
