కర్నూలు జిల్లాలో రూ. 4.25 లక్షల గంజాయి పట్టివేత

కర్నూలు ముచ్చట్లు:

 

కర్నూలు జిల్లా కేంద్రంలో కర్నూలు ఎస్ ఇ బి పోలీసులు శనివారం భారీగా గంజాయి పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 4.25 లక్షలు చేస్తుందని సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమ్ శాలిని వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 10 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరితో పాటు 11 ఎల్ ఎస్ డి స్టాంప్, బ్లాత్స్, 8 మొబైల్ ఫోన్లు, ఒక వేయింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో గంజాయి విలువ రూ. 4.25 లక్షలు కాగా, ఎల్ ఎస్ డి బ్లాత్స్ విలువ 22 మిల్లీ గ్రాముల ధర రూ. 27500.

 

 

 

ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం తుని గ్రామం నుండి రూ.3వేల నుండి రూ. 6000 లకు కొనుగోలు చేస్తున్నారు. జి పే యాప్ ను ఉపయోగించి ఇండియన్ కరెన్సీ ని బిట్కాయిన్ గా మార్చి ఆ డబ్బులతో ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో సమాచారం అందుకున్న కర్నూలు మూడో పట్టణ పోలీసులు జిల్లా ఎస్పీ పకీరప్ప ఆదేశాల మేరకు, కర్నూల్ సబ్ డివిజినల్ పోలీస్ అధికారి కె.వి మహేష్ ఆధ్వర్యంలో మూడో పట్టణ సీఐ తబ్రేజ్, సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, కర్నూలు నగరంలోని నంద్యాల చెక్పోస్ట్ నుంచి అరుంధతి నగర్ కి వెళ్తున్న రహదారిలో ఓ పాడుబడిన ఇంటిలో గంజాయి విక్రయించే నిందితులు ఉండగా పసిగట్టారు. మొత్తం 10 మంది వద్ద సోదా చేయగా 17 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ కేసును ఛేదించిన మూడో పట్టణ పోలీసులను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags: In Kurnool district, Rs. 4.25 lakh cannabis seized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *