Natyam ad

మర్రిపాడులో చెట్టు మీద పిడుగు పడి యువకుడి పరిస్థితి విషమం

గుర్రంకొండ ముచ్చట్లు:

గుర్రంకొండ మండలం మర్రిపాడులో పిడుగు పడి ఓ యువకుడి పరిస్థితి విషమంగా మారింది. కుటుంబీకుల కథనం మేరకు.. మర్రిపాడుకు చెందిన నవాబ్ జాన్ కొడుకు మహమ్మద్ ఆబిద్(25) పాడి ఆవులను మేపుకు రావడానికి మర్రిపాడు సమీపానికి వెళ్ళాడు. వర్షం రావడంతో దగ్గర్లోని చెట్టు కిందికి వెళ్లడంతో సోమవారం సాయంత్రం చెట్టుపై పిడుగు పడి అబీద్ 90 శాతం కాలిపోయి అపస్మారకస్థితిలోకి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న వాల్మీకిపురం108 సిబ్బంది మహేష్, సుబ్రహ్మణ్యం బాధితున్ని మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పెద్దమ్మ చికిత్స అనంతరం అతని పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి అత్యవసర విభాగం డాక్టర్లు తెలిపారు.

 

Post Midle

Tags: In Marripadu, the condition of a young man is critical after lightning struck a tree

Post Midle