‘మీసేవ’లో ఓటరు కార్డుకు రు.25లకు మించి చెల్లించక్కర్లేదు

In 'Messisva', you do not have to pay a voter card beyond Rs 25

In 'Messisva', you do not have to pay a voter card beyond Rs 25

-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. రజత్ కుమార్
Date:22/11/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
కొత్తగా ఓటరుగా నమోదయిన వారికి ఇంటిదగ్గర లేదా పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల కమీషనే ఉచితంగా కార్డులు అంద చేస్తుందనీ, పాత కార్డుల వారు మాత్రం కేవలం రు.25లు మాత్రమే చెల్లించి ‘మీసేవ’లో పొంద వచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. రజత్ కుమార్ స్పష్టం చేసారు.  ‘మీ సేవలో’ ఓటరు కార్డుకు రు.100లు వసూలు చేస్తున్నట్లు  ఎన్నికల కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందుతున్నాయనీ, ఇది అక్రమ వసూలు అని ఆయన ఒక పత్రికా ప్రకటనలో వివరించారు.ఓటరుగా లోగడ నమోదయిన వారు ‘మీసేవ’లో కేవలం రు.25లు మాత్రమే చెల్లిస్తే చాలు.  ఇలా రు.25కు మించి అదనంగా ఎవరయినా వసూలు చేసినపక్షంలో  పూర్తి వివరాలతో 1950కి ఫిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. కొత్తగా ఓటర్లుగా నమోదు అయిన వారికి ఇళ్ళవద్ద ఎపిక్ కార్డులను బూత్ స్థాయి అధికారులు ఉచితంగా అంద చేస్తారని ఆయన వివరించారు.
Tags:In ‘Messisva’, you do not have to pay a voter card beyond Rs 25

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *