Natyam ad

మాక్‌పోలింగ్‌లోఈవిఎంలో…జగనన్న ఎక్కడ..?- గౌరమ్మ ఆవేదన

-జగన్‌,ఫ్యాన్‌ లేదు నేను వేయను

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

హూ…హూ…జగన్‌ ఫోటో లేదు …నేను బటన్‌ నొక్కను. జగన్‌ ఫోటో చూపించు అని ఓ మహిళ మాక్‌పోలింగ్‌లో ఆర్‌వో మధుసూదన్‌రెడ్డిని అడగడంతో అధికారులు విస్తుపోయిన సంఘటన బుధవారం జరిగింది. ఆర్‌వో మధుసూదన్‌రెడ్డి , తహశీల్ధార్‌ సుబ్రమణ్యంరెడ్డిల ఆధ్వర్యంలో మండల కార్యాలయంలో మాక్‌పోలింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పిచ్చిగుండ్లపల్లెకు చెందిన గౌరమ్మ అనే మహిళకు ఈవిఎంలలో ఓటు వేసే విధానం వివరించారు. ఓటు వేయడం అంటే కావాల్సిన గుర్తుపైన , నచ్చినపార్టీకి వేసుకోవాలని ఆర్‌వో అక్కడ ఉన్న డమ్మి గుర్తులను చూపించారు. ఆ మహిళ ఏమాత్రం తడబడకుండ జగన్‌ బొమ్మలేదంటు ఈవిఎంలను పరిశీలించింది. జగన్‌ ఫ్యాన్‌ గుర్తు లేదు నేను బటన్‌ నొక్కనని వెళ్లిపోవడంతో ఆర్‌వో , తహశీల్ధార్‌ నవ్వుకుంటు ఆమెకు ఈవిఎంల పనితీరును రెండవ సారి వివరించారు.

Tags: In Mock Polling in EVM…where is Jagananna..?- Gauramma Aavenda

Post Midle