నల్గోండ, కరీంనగర్ జిల్లాల్లో 79 శాతం సిజరేయన్లే

Date:24/10/2020

నల్గొండ ముచ్చట్లు:

ఏడాది ప్రారంభం నుంచి ఈ నెలలో 17వతేదీ వరకు 3,83,789 ప్రసవాలు జరగ్గా, అందులో 2,28,084 మంది అంటే 60 శాతం సిజేరియన్ ద్వారానే జరగడం గమనార్హం. ఇందులో ప్రభు త్వ ఆసుపత్రుల్లో 98,915 మంది, ప్రెవేటు ఆసుపత్రు ల్లో 1,29,169 ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరిగినట్లు నిర్దారించారు. రాష్ర్టంలో ప్రసవాలపై ప్రజారోగ్య కుటుం బ సంక్షేమ శాఖ ఈ బర్త్ పోర్టల్ ద్వారా నివేదికను త యారు చేప్తుంది. ఇందులో ఎన్ని సిజేరియన్ ద్వారా జరిగాయన్న వివరాలను వెల్లడించింది. మొత్తం ప్రసవాల్లో 57 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో, 43 శాతం ప్రెవేటు ఆసుపత్రుల్లో జరిగాయి. కెసిఆర్ కిట్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్లనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైతేనే సిజేరియన్ చేస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రభు త్వ ఆసుపత్రుల్లో కొందరు గర్భిణీలు సాధారణ ప్రసవాలకు ముందుకు రావడం లేదని డాక్టర్లు చెపుతున్నారు. సాధారణ ప్రసవం చేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందని భావించి కొందరు చెప్పాపెట్టకుండా ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

 

ఈ పరిస్థితి ముఖ్యంగా జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో కనిపిస్తుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. సాధారణ ప్రసవాలు చేస్తే మంచిదేనని, కానీ గర్భిణీలను మానసికంగా సిద్ధం చేయకుండా ఒత్తిడి చేస్తే ప్రయోజనం ఉండదని వైద్యులు అంటున్నారు.కొన్నిచోట్ల ప్రసవాలు చేసే లేబర్ రూంలు సరిగా లేకపోవడం, కొందరు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కూడా సాధారణ ప్రసవానికి కొందరు ధైర్యం చేయడంలేదని తెలుస్తుంది. దీంతో ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణీల సంఖ్య ఒకట్రెండు శాతం తగ్గిందని వైద్య విధాన పరిషత్‌లోని ఒక అధికారి వ్యాఖ్యానించారు. అవకాశమున్నంత వరకు సాధారణ పద్దతిలో ప్రసవం జరిగేలా ప్రభుత్వ వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణ ప్రసవాలైతే పది వేల లోపు తీసుకుంటారు. అదే సిజేరియన్ ద్వారా ప్రసవం చేస్తే రూ. 30 వేల నుంచి ఆసుపత్రి స్థాయిని బట్టి రూ.లక్ష వసూలు చేస్తున్నారు.సహజ ప్రసవాల్లో కొమురంభీం, జోగులాంబ జిల్లాలు ముందున్నాయి. వెనుకబడిన జిల్లాలు అయినా సహజ ప్రసవాలు ఎక్కువగా జరగటం పట్ల అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

 

అత్యంత తక్కువగా కొమురంభీం జిల్లాలో ఈ పది నెలల కాలంలో 4,471 ప్రసవాలు జరగ్గా, అందులో కేవలం 944 మాత్రమే సిజేరియన్ ద్వారా జరిగాయి. అంటే కేవలం 12 శాతమే కావడం విశేషం. జోగులాంబ జిల్లాలో 32 శాతం మాత్రమే సిజేరియన్ అయ్యాయి. ఇక హైదరాబాద్ నగరంలో ఈ నెలల్లో 92,545 ప్రసవాలు జరగ్గా, అందులో 49,535 ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరిగాయి. అంటే 54 శాతం సిజేరియన్ ద్వారానే ప్రసవాలు నిర్వహించారు.సూర్యాపేట, మహబూబాబాద్, కరీంనగర్, నిర్మల్ జిల్లా ల్లో జరిగిన ప్రసవాల్లో అత్యధికంగా ఆపరేషన్ల ద్వారానే చేశారు. మహబూబాబాద్ , సూర్యాపేట జిల్లాల్లో వరుసగా 79, 76 శాతం చొప్పున సిజేరియన్ ద్వారానే ప్రసవాలు చేసినట్లు నివేదిక వెల్లడించింది. సూర్యాపేట జిల్లాలో ఈ నెలల్లో 7229 ప్రసవాలు జరగ్గా, అందులో ఏకంగా 5500 ప్రసవాలు సిజిరేయన్ ద్వారానే జరగడం శోచనీయం. అలాగే మహబూబాబాద్ జిల్లాల్లో 4467 ప్రసవాలు జరగ్గా, అందులో 3540 సిజేరియన్ ఆపరేషన్లే అని తేలింది. అలాగే నిర్మల్ జిల్లాలో 81 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరిగాయి. నిర్మల్ జిల్లాలో 9,398 ప్రసవాల్లో 7,618 ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరిగాయని నివేదిక తెలిపింది.

మార్కెట్ కు దీపావళి శోభ

Tags: In Nalgonda and Karimnagar districts, 79 per cent are Caesareans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *