నంద్యాల లో విద్య వైద్య నికి పెద్దపీట

శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి

నంద్యాల ముచ్చట్లు:

నంద్యాల జిల్లా కేంద్రంలో శనివారం నాడు నంద్యాల జిల్లా హాస్పటల్ లో1కోటి 50లక్షల రూపాయాతో   అత్యాధునిక వసతులతో ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్ నందు 60 సంవత్సరాల వృద్ధుల కోసం మరియు చిన్న పిల్లల కోసం భవనాలను శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి పున ప్రారంభింతారు.. . ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు 1కోటి50 లక్షల రూపాయలతో వృద్ధుల కోసం మరియు చిన్న పిల్లల కోసం అత్యాధునిక వసతులతో నూతన గదులను ప్రారంభించడం జరిగిందని ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్య వైద్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రజల కోసం నూతన నూతన ఒరవడికి  శ్రీకారం చుట్టారని అలాగే త్వరలో  నంద్యాల జిల్లా కేంద్రంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నంద్యాలలో ఇంత అభివృద్ధి జరుగుతుంటే తెలుగుదేశం నాయకులు కళ్ళు మూసుకుని మాట్లాడటం సబబు కాదని ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే నంద్యాలలో ఎంత అభివృద్ధి జరిగిందో కనబడుతుందన్నారు. త్వరలో మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు కూడా ప్రారంభమవుతాయని తెలియజేశారు.

 

Tags: In Nandyala, education is more important than medicine

Leave A Reply

Your email address will not be published.