నూనెగుండ్లపల్లెలో.. ప్రజారోగ్యం నీళ్లపాలు

ఇది ముమ్మాటికీ అధికారుల పాపాలు.

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

నెలలు తరబడి నూనెగుండ్లపల్లెలో పంచాయతీ నీటి ట్యాంకు శుభ్రం చేయకపోవడం.. ఫ్రై డే .. డ్రై డే కార్యక్రమాన్ని గాలికొదిలేయడం.. పంచాయతీ నీటికి ప్రైవేటు పెత్తందారులను నియమించడం గాడి తప్పిన ప్రభుత్వ పాలన యంత్రాంగానికి నిదర్శనం.. ఇష్టా రాజ్యాంగా ఇంటింటికి పంచాయతీ నీటి గొట్టాలకు గేటు వాల్వులు అమర్చుకోవడం.. పట్టించుకోవాల్సిన గ్రామ సచివాలయం యంత్రాంగంపై స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఉండడం ప్రస్తుత ప్రభుత్వ పాలన పద్ధతులను నీరుగార్చడమే అని పలువురు గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా సంబంధిత బంగారుపాళ్యం ఎంపీడీవో, ఈవో పి ఆర్ ఆర్ డి, ఆర్డబ్ల్యూఎస్, సచివాలయం యంత్రాంగం తగిన చర్యలు చేపట్టి పంచాయతీ నీటికి ప్రైవేటు వ్యక్తుల పెత్తనాన్ని అరికట్టి.. ఇష్ట రాజ్యాంగ అమర్చిన ప్రైవేటు గేటు వాల్వులను తొలగించి.. ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామ ప్రజలకు సురక్షిత మంచినీటి సౌకర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది.

 

 

Tags:In Nunegundlapalle.. public health water milk

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *