ఇసుక తరలింపు ఆపాలని అందోళన
యాదాద్రి ముచ్చట్లు:
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూర్ మండల పరిధి లోని బిక్కేరు వాగు నుండి ఇసుక తరలింపుకు ఎలాంటి అనుమతులు ఇవ్బొద్దని రైతులు ఆందోళన చేపట్టారు. మండల పరిధిలోని కోటమర్తి గ్రామ శివారులోని బిక్కేరు వాగు లో ఇసుక మోతాదు మరియు గ్రౌండ్ వాటర్ నిల్వల సర్వే కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చిన మైనింగ్ మరియు గ్రౌండ్ వాటర్ అధికారులను కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆద్వర్యం లో రైతులు అడ్డుకొని నిరసన తెలిపారు.బిక్కేరు వాగు లో అనేక మంది రైతులు బోర్లు వేసుకొని పైపుల ద్వారా తమ వ్యవసాయ పొలాలకు నీళ్లు మళ్లించుకొని పంటలు పండించుకుంటున్నామని,ఇసుక తరలింపుకు అనుమతులు ఇచ్చి తమ పొట్ట కొట్టొద్దని రైతులు వాపోయారు..ఇసుక తరలింపు ద్వారా గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి తమకు వ్యవసాయానికి నీళ్లు దొరకవని,దాంతో తమ జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతస్యాని అధికారులతో రైతులు విన్నవించుకున్నారు.ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేయడానికి వీలు లేదని రైతులు అధికారులతో తెగేసి చెప్పారు.దీంతో చేసేదేమీలేక సర్వే చేసుకుండానే అధికారులు వెనుదిరిగారు.
Tags; In order to stop the movement of sand

