పాలేరులో మంత్రి తుమ్మలకు ఘనస్వాగతం

In Parliament, the Minister welcomed the sneezing

In Parliament, the Minister welcomed the sneezing

Date14/09/201
8వేల బైక్‌లతో భారీ ర్యాలీ
ఖమ్మం ముచ్చట్లు:
పాలేరులో మంత్రి తుమ్మలకు స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నేతలు ఘనస్వాగతం పలికారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రకటన తర్వాత తొలిసారి పాలేరు వచ్చారు. కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద తుమ్మలకు టీఆర్‌ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు. నాయకన్ గూడెం నుంచి కూసుమంచి వరకు టీఆర్‌ఎస్ నాయకులు 8వేల బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు.
ఓపెన్‌టాప్ వాహనంలో మంత్రి ర్యాలీలో పాల్గొన్నారు. 70ఏండ్లలో జరగని పనులు ఈ నాలుగేళ్లలో సీఎం కేసీఆర్ పూర్తి చేసి చూపించారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పాలేరును అభివృద్ధి చేశామని వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరానికి సాగు నీరందిస్తామని చెప్పారు. 100 సీట్లతో మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు దీవించాలని కోరారు.
ఎన్నికలు వచ్చాయని ప్రతిపక్ష నేతలు బట్టలు సర్దుకుని ఊళ్లకు పయనమయ్యారని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలున్నా, లేకున్నా టీఆర్‌ఎస్ నేతలు జనంలోనే ఉన్నారని తెలిపారు. పాలేరు నియోజకవర్గ అభివృద్ధి తుమ్మలతోనే సాధ్యమని పేర్కొన్నారు. మరోసారి భారీ మెజార్టీతో తుమ్మలను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
Tags:In Parliament, the Minister welcomed the sneezing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *