పార్లమెంటులో అందోళనలు..నిరసనలు

In Parliament

In Parliament

Date:19/07/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
గురువారం పార్లమెంటు ఉభయసభలు నిరసనలతో ప్రారంభమయ్యాయి. లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై రేపు చర్చకు అంగీకరించిన నేపథ్యంలో, విపక్ష సభ్యులంతా సభలో కొద్దిసేపు సైలెంట్ గా ఉన్నారు. తామిచ్చిన నోటీసుపై చర్చ చేపట్టాలంటూ విపక్షాల సభ్యులు ఆందోళన చేశారు. అయితే క్వశ్చన్ అవర్ తరువాతే చర్చకు అవకాశమిస్తానని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు.  రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఎంపిలు పార్లమెంటు భవనం ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు.  కొందరు ప్లకార్డులు పట్టుకోగా, మిగిలిన వారు అర్థిస్తున్నట్లు చేతులు పట్టుకుని ధర్నాలో పాల్గొన్నారు. పార్లమెంటు  ఆవరణలోని  గాంధీ విగ్రహం వద్ద వైకాపా మాజీ ఎంపిలు ధర్నా నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వారు ఆందోళన చేసారు.
పార్లమెంటులో అందోళనలు..నిరసనలు https://www.telugumuchatlu.com/in-parliament/
Tags:In Parliament

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *